AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి వారు ఇంటికి భోజనానికి పిలిచినా వెళ్ళవద్దన్న చాణక్య.. ఎందుకంటే..

ఆచార్య చాణక్యుడు సమస్త మానవాళికి తన గ్రంధాల ద్వారా మానవాళి జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలను అందించాడు. విష్ణుశర్మ పేరుతో పంచతంత్రము, కౌటిల్యుని పేరుతో అర్థ శాస్త్రము, చాణక్యుని పేరుతో చాణక్య నీతిని రచించాడు. చాణక్య నీతిలోని సూత్రాలను పాటిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని చిన్న తనం నుంచే చదవడం వలన మంచి రాజనీతిజ్ఞులుగా, తెలివైన వారుగా, విలువలతో కూడిన విద్యను అభ్యసించిన వారు అవుతారు. ఈ రోజు కొంత మంది ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళవద్దు అని చాణక్య చెప్పాడు. ఎందుకంటే

Chanakya Niti: ఇలాంటి వారు ఇంటికి భోజనానికి పిలిచినా వెళ్ళవద్దన్న చాణక్య.. ఎందుకంటే..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Apr 18, 2025 | 7:23 AM

Share

చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉందని అనేది తన నీతి బోధనల ద్వారా భావితరాలకు అందజేశాడు. నేటికీ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. చాణక్య నీతి సూత్రాలను పాటిస్తే..జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని పేర్కొన్నాడు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా అవసరం అని నీతి శాస్త్రం చెబుతోంది. అయితే కొందరి వ్యక్తులకు మాత్రం ఎంత వీలయితే అంత దూరంగా ఉండాలని చెబుతోంది. ముఖ్యంగా కొంతమంది భోజనానికి పిలిచినా సరే వెళ్ళవద్దు అని చాణక్యనీతి తెలుపుతుంది. సర్వసాధారణంగా ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే వెళ్తాం.. అయితే కొందరి ఇళ్ళలో భోజనం చేయడం అంత మంచిది కాదని ఆచార్య చాణక్య చెబుతున్నాడు.

అప్పుగా డబ్బులు తీసుకున్న వారి ఇంటికి: ఎవరి దగ్గర అయినా డబ్బులను అప్పుగా తీసుకుంటే.. వారు భోజనానికి పిలిచినా సరే వెళ్ళవద్దు అని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కనుక పిలిచిన వెంటనే భోజనానికి వెళ్తే.. వారు మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అప్పుగా తీసుకున్న డబ్బులను సమయానికి తిరిగి ఇవ్వలేకపోయి ఉంటే మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా ఉంటుంది. కనుక అప్పు తీసుకున్నవారి ఇంటికి ఆహ్వానం ఉన్నా భోజనానికి వెళ్ళవద్దు అని చెబుతున్నాడు చాణక్య.

నేరస్తుల ఇంటికి: కొంత మంది కావాలని తప్పులు చేస్తూ ఉంటారు. నేర చరిత్ర కూడా కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులున్న వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం అంటే.. వీరితో సమానంగా మిమ్మల్ని చూస్తారు. వారితో స్నేహం ఉందని భావించి.. మీరు కూడా నేరస్తులు అన్నట్లు భావిస్తారు. కనుక ఇటువంటి వ్యక్తు ఇంటికి భోజనానికి వెళ్ళడం వలన సమాజంలో చిన్న చూపుచూస్తారు.

ఇవి కూడా చదవండి

డబ్బే జీవితం అనుకునేవారి ఇంటికి: సాధారణంగా డబ్బులు ప్రతి ఒక్కరికీ కావాలి. డబ్బులంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. అయితే కొంతమందికి డబ్బంటే అత్యాశ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బుపై అత్యాశ ఉన్న వ్యక్తులు ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళవద్దు అని చాణక్య చెబుతున్నాడు. భోజనానికి వచ్చిన వారి నుంచి ఏదోకటి ఆశించే గుణం వీరి సొంతం.. అంతేకాదు డబ్బుపై ఆశతో ఉన్నవారు పైకి మర్యాదగా ప్రవర్తించినా.. లోపల మాత్రం వేరే ఆలోచనలతో భోజనం పెడతారు. కనుక ఇటువంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు అని చెప్పాడు ఆచార్య చాణక్య.

మాటలతో బాధపెట్టే వ్యక్తుల ఇంటికి: కొందరు మాట అదుపు ఉండదు. నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరులను బాధపెడతారు. ఇలా మాటలతో బాధ పెట్టే వారి ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్లకపోవడమే మంచిదని చాణిక్య నీతి చెబుతోంది. ఎందుకంటే ఓవైపు భోజనం పెట్టి.. మరోవైపు మనసు బాధపడే టట్లు అవమానకరమైన రీతిలో మాట్లాడి ఎదుటివారిని బాధపెడుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు ఎంత వీలయితే అంత దూరం ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది.

దేవుడంటే భక్తీ లేని వారి ఇంటికి: దైవభక్తి లేని వారు.. దైవ దూషణ చేసే వారి ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు. ఎందుకంటే వీరు ఏదో ఆశించి మాత్రమే భోజనానికి పిలుస్తారు. వీరి ఆహ్వానంలో ధర్మం ఉండదు. వెళ్ళిన తర్వాత మర్యాద పాటించరు. అందువల్ల ఇలాంటి వ్యక్తుల ఇంటికి భోనననికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెబుతోంది చాణక్య నీతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..