AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. గడువు దగ్గరపడింది

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఈ నియామక ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులు జులై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది..

RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. గడువు దగ్గరపడింది
RRB Technician Recruitment Registration Deadline
Srilakshmi C
|

Updated on: Jul 26, 2026 | 5:02 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రీజియన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్) పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,234 వరకు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అంటే మరో 5 రోజుల్లోనే దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ పోస్టులను ట్రాక్ మెషిన్, బ్రిడ్జ్, డీజిల్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, టీఆర్‌ఎస్, ఈఎంయూ, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ తదితర విభాగాల్లో చేపట్టనున్నారు. సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ, శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRB రైల్వేలో టెక్నీషియన్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతి (మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి గ్రేడ్-I పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాలు, గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ OBC/ EWS అభ్యర్థులు రూ.500, SC/ ST/ మహిళలు/ ఎక్స్ సర్వీస్‌మెన్/ PwBD/ ట్రాన్స్‌జెండర్/ EBC అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. CBTకు హాజరైన వారికి బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ.400 వరకు రిఫండ్ చేస్తారు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జులై 31, 2026గా నిర్ణయించారు. అప్లికేషన్ సవరణల1 ఆగస్టు 2026 నుంచి 10 ఆగస్టు 2026 వరకు ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. CBT పరీక్ష మొత్తం 90 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన వారికి టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.

RRB రైల్వేలో టెక్నీషియన్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?..
RRB రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?..
1, 8, 2.. టీమిండియా హిస్టరీలోనే చెత్త రికార్డు..
1, 8, 2.. టీమిండియా హిస్టరీలోనే చెత్త రికార్డు..
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!