AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D.Ed, B.Ed అభ్యర్థులకు అలర్ట్.. TET 2027 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల షెడ్యూల్ ఇదే!

టీజీ టెట్ జనవరి-2027 నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా, డిసెంబర్ 10 చివరి తేదీగా నిర్ణయించారు. 2027 జనవరి 3 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు, అర్హతలు, పరీక్షల షెడ్యూల్ తెలుసుకోండి..

D.Ed, B.Ed అభ్యర్థులకు అలర్ట్.. TET 2027 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల షెడ్యూల్ ఇదే!
Telangana Teacher Eligibility Test
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 12:30 PM

Share

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జనవరి-2027 నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీ టెట్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ నవంబర్ 13, 2026న అధికారికంగా ప్రకటన జారీ చేశారు.

తెలంగాణ టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీ టెట్ జనవరి-2027 పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. 2027 జనవరి 3వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం తదితర సమాచారంతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను నవంబర్ 16, 2026 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. టీజీ టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు 2026 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే నిర్వహించనున్నారు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే

  • నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 13, 2026.
  • నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్: నవంబర్ 16, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 16, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2026.
  • పరీక్షల ప్రారంభం: జనవరి 3, 2027.
  • పరీక్షల ముగింపు: జనవరి 15, 2027.
  • పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

టీజీ టెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షల వివరాలను అభ్యర్థులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. టీజీ టెట్‌లో అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us