AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కొత్త ఇంటికి శంకుస్థాపన చేస్తున్నారా.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అంటారు పెద్దలు. అయితే ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరికీ కల. మీరు కూడా కొత్త ఇల్లు కట్టాలని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చేసే చిన్న తప్పు మీ జీవితంపై చాలా చెడు ప్రభావాలను చూపుతుంది. కనుక కొత్త ఇల్లు కట్టే ముందు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

Vastu Tips: కొత్త ఇంటికి శంకుస్థాపన చేస్తున్నారా.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
Vastu Tips Bhoomi Puja
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 12:55 PM

Share

భారతీయ వాస్తు శాస్త్రం, సంప్రదాయాలలో కొత్త ఇంటికి శంకుస్థాపన చేస్తారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పునాదిని తీస్తారు. ఈ పునాదిలో కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొత్త ఇంటికి శంకుస్థాపన సమయంలో తీసిన పునాదిలో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల ఇంటి పునాది బలంగా ఉంటుందని నమ్ముతారు. దీనితో పాటు సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. అంతేకాదు ఆ ఇంట్లో నివసించే వారి జీవితంలో సిరి సంపదలకు లోటు ఉండదు. జీవితంలోని సమస్యల ఉపశమనం ఇస్తుందని నమ్మకం.

పునాదిలో ఏ వస్తువులు సమర్పించాలంటే

  1. వెండి పాముల జత: వాస్తు శాస్త్రంలో పాములను భూమికి, పాతాళానికి రక్షకులుగా పరిగణిస్తారు. జంట వేడి పాములను పునాదిలో వేయడం వలన ఇంటి పునాదిని కాపాడుతుంది. దుష్ట శక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తి , శ్రేయస్సును కూడా సూచిస్తుందని నమ్మకం.
  2. రాగి కలశం: రాగి కలశంలో నీటితో నింపి, అందులో కొన్ని నాణేలు వేసి.. పునాదిలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాగి ఒక స్వచ్ఛమైన లోహం. కలశం విశ్వ శక్తిని సూచిస్తుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని.. శ్రేయస్సును తెస్తుంది.
  3. పంచ రత్నాలు: బంగారం, వెండి, వజ్రం, పచ్చ, నీలమణి వంటి ఐదు రత్నాలను ఒక చిన్న వస్త్రంలో కట్టి పునాదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రత్నాలు వేర్వేరు గ్రహాలను సూచిస్తాయి. ఇంటికి సానుకూల శక్తి, అదృష్టం, శ్రేయస్సును తెస్తాయని విశ్వాసం.
  4. ఇత్తడి తాబేలు: తాబేలు స్థిరత్వం, దీర్ఘాయువు, పెరుగుదలకు చిహ్నం. పునాదిలో ఇత్తడి తాబేలును ఉంచడం వల్ల ఇంటి పునాది బలపడుతుంది. కుటుంబ సభ్యుల జీవితం స్థిరంగా ఉంటుంది. దీర్ఘాయుస్సుతో జీవిస్తారని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. అక్షతలు: పసుపు శుభప్రదమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే బియ్యం పరిపూర్ణత, శ్రేయస్సును సూచిస్తాయి. కనుక పసుపు బియ్యం కలిపి తయారు చేసిన అక్షతలను పునాదిలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత, శ్రేయస్సు నెలకొంటుంది.
  7. ‘ఓం’ లేదా స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇటుక: పునాది వేసే సమయంలో మొదటి రాయి లేదా ఇటుకపై ‘ఓం’ లేదా ఏదైనా ఇతర శుభ చిహ్నం (స్వస్తిక వంటివి) ఉన్నవి ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది దేవుని ఆశీర్వాదానికి, సానుకూల శక్తికి చిహ్నం.
  8. నవ ధాన్యాలు: పునాదిలో నవ ధాన్యాలను వేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
  9. అనంత శేషనాగు ప్రతిమ: కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలలో పునాదిలో అనంత శేషనాగు చిన్న ప్రతిమను కూడా ఉంచుతారు. ఆయన భూమిని పట్టుకుని స్థిరత్వాన్ని కలిగిస్తాడని నమ్మకం.
  10. ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో పునాదిలో ఈ వస్తువులను ఉంచడంతో శుభప్రదం. అంతేకాదు శంకుస్థాపన కార్యక్రమం శుభ సమయంలోనే జరగాలని, వాస్తు నియమాలను పాటించడం కూడా అవసరమని గుర్తుంచుకోవాలి. తద్వారా ఇంట్లో ఆనందం, శాంతి , శ్రేయస్సు ఉంటాయి. ఎవరైనా కొత్త ఇల్లు నిర్మించాలనుకుంటే ముందుగా వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు