AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపారంలో దుమ్ము రేపుతారట..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం జన్మతేదీ మన జీవితం మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూల సంఖ్య 1 కలిగినవారు నాయకత్వ లక్షణాలు, ధైర్యం, విజయం సాధించే ధోరణితో ముందుంటారు. ఈ సంఖ్య వారికి వ్యాపారంలో, జీవన విధానంలో గణనీయమైన పురోగతిని అందిస్తుంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపారంలో దుమ్ము రేపుతారట..!
Lucky Birth Dates In Numerology
Prashanthi V
|

Updated on: Apr 22, 2025 | 8:49 PM

Share

మన జన్మతేదీ మన జీవితం మీద విశేష ప్రభావం చూపుతుంది. మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, లక్ష్యాలు, మనం ఎలా ఎదుగుతామన్నది ఎంతోమేర సంఖ్యాశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ శాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంది. ఈరోజు మనం మాట్లాడబోయే ప్రత్యేక సంఖ్య.. మూలసంఖ్య 1. ఈ సంఖ్య కలిగినవారు జీవితంలో తక్కువ సమయంలో ఎక్కువ సాధించగలవారు. వ్యాపార రంగంలో ముఖ్యంగా ఈ సంఖ్య ఉన్నవారు ముందుండడం విశేషం.

జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28వ తేదీన పుట్టివారి మూలసంఖ్య 1గా పరిగణించబడుతుంది. ఈ సంఖ్య కలిగినవారికి వ్యాపార అనుభూతి సహజంగా కలుగుతుంది. వ్యాపారాన్ని ఒక సాధారణ పనిగా కాదు.. ఒక అవకాశంగా చూస్తారు. వారు ఎలాంటి రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించినా.. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే వీరి లక్షణాలలో నాయకత్వ గుణాలు, పట్టుదల, ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటాయి.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 1కి అధిపతి గ్రహంగా సూర్యుడు గుర్తించబడతాడు. సూర్యుడు శక్తి, ప్రభావం, ఆత్మబలానికి ప్రతీక. అందుకే ఈ సంఖ్య కలిగినవారికి సహజంగా ఓ శక్తివంతమైన నాయకుడి లాంటి వ్యక్తిత్వం ఉంటుంది. వీరు ఎక్కడ ఉన్నా మెరుస్తుంటారు. తమ కష్టానికి తగ్గ ఫలితం పొందడానికి వెనుకడుగు వేయరు. వారి జీవితంలో ఓ ఆకర్షణ, ఓ స్పష్టత కనిపిస్తుంది.

ఈ సంఖ్య కలిగినవారికి ధైర్యం, నమ్మకం, దృఢ సంకల్పం ఎంతో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి ఏ పని అయినా చేయాలి అనుకున్నారంటే దానిని పూర్తి చేసే వరకు వెనకడుగు వేయరు. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వారు దాన్ని భయంగా చూసే వ్యక్తులు కాదు. వాళ్లు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నైపుణ్యం కలవారు. ఎంతటి రిస్క్ అయినా తీసుకుని విజయాన్ని సాధించగల సత్తా వీరిలో ఉంటుంది.

ఈ సంఖ్య కలిగినవారు జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు. వారి దగ్గర డబ్బు, గుర్తింపు, గౌరవం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. వారికి స్టేటస్ ముఖ్యమైన విషయం. అందువల్ల వారు ఉన్నత స్థాయి పరిచయాలు పెంచుకుంటారు. సోషల్ సర్కిల్స్‌లో వారి స్థానం ముందు వరుసలో ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతను చాటుకుంటారు.

ఇలా చూడగలిగితే సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 1 కలిగిన వారు ప్రతిసారీ ఎదుగుదల వైపే అడుగులు వేస్తారు. తమ లక్ష్యాల పట్ల నిబద్ధత, వారి శక్తి, సూర్యుని అనుగ్రహం.. ఇవన్నీ కలవడంతో వారు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేసే అవకాశం వీరిది. మీరు కూడా ఈ సంఖ్యకు చెందినవారైతే, మీలోని అద్భుతమైన లక్షణాలను గుర్తించి సరైన దిశగా ప్రయాణం ప్రారంభించండి.