AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Friendship: ఊరందరికి స్నేహితుడుగా మారిన కొండముచ్చు..అంజి అనిపిలిస్తే ఎక్కడ వున్నా వచ్చేస్తుంది

మనిషికి ప్రకృతికి అవినాభావ సంభందం వుంది. చుట్టూ సంచరించే పలు రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటి పై ఆధారపడి మనిషి జీవిస్తుంటాడు. అయితే కోడి, మేక, ఆవులు, పశువులు, కుక్క ఇవన్నీ తమ యజమానికి నమ్మకంగా ఉంటాయి. వారి మాట వినటంతో పాటు పెంపకందారు నివాస ప్రాంతంలో ఉంటా జీవిస్తుంటాయి. ఐతే ఆ ఊర్లో ఉన్న కొండముచ్చు మాత్రం ఊరందరికీ స్నేహితుడిగా మారిపోయింది. ఎవరు ఏది పెట్టినా తినటం అందరితో కలిసిపోవడం తో ఎవరు దాన్ని ఏమి అనటంలేదు.

Unique Friendship: ఊరందరికి స్నేహితుడుగా మారిన కొండముచ్చు..అంజి అనిపిలిస్తే ఎక్కడ వున్నా వచ్చేస్తుంది
Monkey Lives With Humans
B Ravi Kumar
| Edited By: Surya Kala|

Updated on: Apr 23, 2025 | 8:27 AM

Share

కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల పై దాడి చేసి తోటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి దీంతో వాటిని చూస్తే గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతారు.అవి ఏమి చేస్తాయో అని వాటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతారు ప్రజలు. కోతులలో మరో జాతి అయిన కొండముచ్చులను చూస్తే భయపడిపోయి ఇంటి లోపలకి పారిపోయి తలుపులు మూసుకుంటారు చాలా మంది. అవి ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటిది ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది. కొండముచ్చును చూస్తే చాలా మంది వణికిపోతారు. ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటి ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది.

కొండముచ్చు కు దాని పూర్వ జన్మ గుర్తొచ్చిందో లేక మనుషులంటే భయం పోయిందో గాని ఆ కొండముచ్చు ఆ గ్రామంలోకి వచ్చి ప్రజలతో కలిసి జీవిస్తుంది కొన్ని రోజుల క్రిందట ఎక్కడినుండి వచ్చిందో ఒక వానరం ఆ కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలతో సమానంగానే ఆ వానరాన్ని చూస్తున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన దాసరి హనుమంతు ఇంటిని ఒక వానరం గత కొన్ని రోజులుగా తన నివాసంగా మార్చుకుంది. కొన్ని రోజుల కిందట ఈ వానరానికి కాలికి దెబ్బ తగలడంతో చరణ్ ధైర్యంతో వానరాన్ని చేరదీసి వైద్యం చేయించాడు. దీంతో అప్పటినుండి ఆ కుటుంబ సభ్యుల వద్దనే ఈ వానరం ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే తమ ఇంటికి ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడని ఆ కుటుంబ సభ్యులు ఆనంద పడుతున్నారు వారు ఏది ఇచ్చిన అది తింటూ కుటుంబ సభ్యుకలిసి ఉంటుంది. వారి పిల్లలతో ఆడుకుంటుంది. గ్రామంలోని అందరూ దానిని ముద్దుగా హనుమంతు, అంజి అనే పేరుతో పిలుస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..