AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.. సామాన్యులకు పండుగే..

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల నుంచి గోధుమ పండి కూడా పంపిణీ చేయనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని జనవరి నుంచి అమలు చేస్తోంది. అయితే మిగతా జిల్లాల్లో కూాడా అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.

Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.. సామాన్యులకు పండుగే..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 11:17 AM

Share

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెల్లకార్డు కలిగి ఉన్నవారికి గోధుమ పండిని పంపిణీ చేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ప్రారంభం కాలేదు. ఈ నెల నుంచి మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరికొంతమంది పేదలకు తక్కువ ధరకే గోధుమపిండి లభించనుంది. బయట మార్కెట్లో గోధుమ పిండి కొనాలంటే బ్రాండ్‌ను బట్టి కేజీ రూ.70 వరకు ఉంటుంది. అయితే తెల్లకార్డు ఉన్నవారికి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా కిలో రూ.20కే అందించనుంది. సామాన్యులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ నెల నుంచి మరికొన్ని జిల్లాల్లో గోధుమ పిండి సరఫరా చేయనున్నామని, ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

జొన్నలు, రాగులు పంపిణీ

ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు జొన్నలు, రాగుల పంపిణీ చేపడుతున్నారు. ఒక్కో కార్డుపై బియ్యానికి బదులు 3 కిలోల వరకు జొన్నలు ఇస్తున్నారు. అంటే మూడు కిలోల జొన్నలు తీసుకుంటే బియ్యంలో 3 కిలోలు తగ్గిస్తున్నారు. ఇక రాగులు కూడా ఇదే తరహాలో పంపిణీ చేస్తున్నారు. అయితే కందిపప్పును కూడా కొన్ని నెలల పాటు ప్రభుత్వం పంపిణీ చేసింది. బయట మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.100కిపైగా పలుకుతుంది. కానీ రేషన్ షాపుల ద్వారా కిలో రూ.67కే ప్రభుత్వం కార్డుదారులకు అందించింది. అయితే ప్రభుత్వం దగ్గర కందిపప్పు నిల్వలు లేకపోవడం, సరఫరా నిలిచిపోవడంతో కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. దీంతో కందిపప్పు కోసం లబ్దిదారులు ఎదురుచూస్తుండగా.. పంపిణీ ఆగిపోయింది. ఈ నెల కూడా కందిపప్పు పంపిణీ జరగడం లేదు. దీంతో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ నెలలో కూడా నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.

వీరికి ఇంటి దగ్గరకే సరుకులు

ఏపీ ప్రభుత్వం ప్రతీ నెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ చేపడుతోంది. 65 ఏళ్లు పైడినవారికి రేషన్ డీలర్లు ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్నారు. మిగిలిన లబ్దిదారులు షాపు వద్దకే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. అటు రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ కార్డులకు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే కుటుంబసభ్యుల వివరాలన్నీ తెలుస్తాయి. రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చింది. దీని వల్ల రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Follow Us