Pahalgam Terror Attack: పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్‌గామ్ ఉగ్రవాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ట్రెక్కింగ్ టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది చనిపోవడంతో యావత్ దేశం విషాదంలో కూరుకుంది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు..అంతేకాకుండా.. 20మందికిపైగా గాయపడ్డారు.. ఈ ఉగ్రచర్యపై ఆక్రోశం వ్యక్తం అవుతోంది. ఈ ఉగ్రవాద ఘటనను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు..

పహల్గామ్ ఉగ్రవాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ట్రెక్కింగ్ టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది చనిపోవడంతో యావత్ దేశం విషాదంలో కూరుకుంది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు..అంతేకాకుండా.. 20మందికిపైగా గాయపడ్డారు.. ఈ ఉగ్రచర్యపై ఆక్రోశం వ్యక్తం అవుతోంది. ఈ ఉగ్రవాద ఘటనను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు.. అమానవీయ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రవాద ఘటనపై రాహుల్ గాంధీ.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు.. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ ఉగ్రవాద దాడి గురించి కాంగ్రెస్ నాయకుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ కర్రాతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బాధితుల కుటుంబాలకు న్యాయం కోసం మద్దుతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
Spoke with HM Amit Shah, J&K CM Omar Abdullah, and J&K PCC President Tariq Karra about the horrific Pahalgam terror attack. Received an update on the situation.
The families of victims deserve justice and our fullest support.
— Rahul Gandhi (@RahulGandhi) April 23, 2025
ఇదిలాఉంటే.. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. ఉగ్రదాడికి పాల్పడ్డవారిని కఠినంగాశిక్షించాలన్నారు. ఉగ్రదాడిలో బాధితులకు న్యాయం జరగాలి, సరిహద్దు ఉగ్రవాద దాడికి గట్టి సమాధానం ఇవ్వాలన్నారు. జమ్మూలో పర్యాటకుల భద్రత కోసం.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో మాట్లాడాలని ఖర్గే కోరారు.
ఉగ్రదాడి ఘటనను ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ
కాశ్మీర్ లో ఉగ్రదాడి ఘటనను MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. జమ్ము కాశ్మీర్ ఘటన లో ఇంటెలిజెన్సీ వైఫల్యం కనిపిస్తుందన్నారు. ఇది పుల్వామా కంటే అతిపెద్ద ఘటన.. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇప్పుడే పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
కాగా.. సౌదీ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ.. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకు NSA అజిల్ దోవల్ తో భేటీ అయ్యారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. CCS సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. కాగా.. నిన్న రాత్రే శ్రీనగర్‌కు వెళ్లిన హోం మంత్రి అమిత్ షా.. జమ్ముకశ్మీర్ LG, CMతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువూ గాలిస్తున్నారు. నింగి, నేల ఏదీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో.. క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం కాశ్మీర్ బంద్ పిలుపునకు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..