AP Model Schools 2022: ఏపీ మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 మోడల్‌ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు..

AP Model Schools 2022: ఏపీ మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Ap Model Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 07, 2022 | 9:20 PM

AP Model School Admissions 2022-23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 మోడల్‌ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ https://apms.apcfss.in/లో ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా సెప్టెంబర్‌ 1, 2010 నుంచి ఆగస్టు 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. లాటరీ, రిజర్వేషన్‌ రూల్స్‌ ప్రకారం విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 5, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022.
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 16, 2022.
  • సెలక్షన్‌ లిస్టు విడుదల తేదీ: జూన్‌ 30, 2022.
  • సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌: జులై 1, 2022.

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.