CLAT 2022 Exam Date: క్లాట్ – 2022 ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల..పరీక్ష తేదీ ఎప్పుడంటే..
క్లాట్ యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు 2022-23 విద్యాసంవత్సారానికి సంబంధించి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022కు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న..
CLAT 2022 admit card download: యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు 2022-23 విద్యాసంవత్సారానికి సంబంధించి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022కు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్consortiumofnlus.ac.inలో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు కాన్సార్టియమ్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (NLUs) ప్రకటన విడుదల చేసింది. క్లాట్ ప్రవేశ పరీక్ష 2022 జూన్ 19న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. కాగా ఈ ఏడాది తొలిసారిగా క్లాట్ ప్రవేశ పరీక్షను రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. తొలి విడత ప్రవేశ పరీక్ష జూన్ 19న నిర్వహించనుండగా, రెండో విడత ప్రవేశ పరీక్ష డిసెంబర్ 18న జరుగుతుందని ఎన్‌అల్‌యూ ఇప్పటికే ప్రకటించింది.
CLAT 2022 admit card ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చెయ్యాలి.
- తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- ‘Download Admit Card’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది.
- సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్యల తలెత్తినా.. లేక ఇతర సందేహాల నివృతి కోసం clat@consortiumofnlus.ac.inకు మెయిల్ చేయవచ్చు లేదా 080-47162020 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్/మెయిల్ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.