NEET PG 2022 Score Card: రేపే నీట్‌ పీజీ 2022 స్కోర్‌ కార్డులు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఊసేది?

నీట్‌ పీజీ స్కోర్‌ కార్డులు రేపు (జూన్ 8)న విదుదలవ్వనున్నట్లు ఎన్‌బీఈ ప్రకటన విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌..

NEET PG 2022 Score Card: రేపే నీట్‌ పీజీ 2022 స్కోర్‌ కార్డులు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఊసేది?
Neet Pg 2022
Follow us

|

Updated on: Jun 07, 2022 | 3:57 PM

NEET PG Cut Off 2022 Category Wise and Score Card: నీట్‌ పీజీ (NEET PG 2022) ఫలితాలు జూన్‌ 1 (బుధవారం)న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 800ల మార్కులకు గానూ విద్యార్ధులు సాధించిన మార్కుల వివరాలు, కట్‌ఆఫ్‌ మార్కుల జాబితాను విడుదల చేసింది. కాగా తాజాగా నీట్‌ పీజీ స్కోర్‌ కార్డులు రేపు (జూన్ 8)న విదుదలవ్వనున్నట్లు ఎన్‌బీఈ ప్రకటన విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ nbe.edu.in.లో స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంతో స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా ఈ ఏడాది మే 21న, 849 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష జరుగగా.. పరీక్ష నిర్వహించిన అనంతరం కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఖాళీగాఉన్న దాదాపు 42,000ల పీజీ సీట్ల కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన 2 లక్షల మంది ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ పీజీ 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన కట్ఆఫ్‌ మార్కులు కూడా విడుదలయ్యాయి. స్కోర్‌కార్డు, ఫలితాల ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులకు NEET PG 2022 కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించడం జరుగుతుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. నీట్‌ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2022 ఇంకా ప్రకటించలేదు.

నీట్‌ పీజీ 2022 కటాఫ్‌లు ఇవే..

ఇవి కూడా చదవండి
  • జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్: 275
  • వికలాంగ విద్యార్థులకు: 260
  • ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు: 245

NEET PG scorecard 2022 ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ nbe.edu.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై స్కోర్‌ కార్డు ప్రత్యక్షమవుతుంది.
  • సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు