AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనం నిర్లక్ష్యం చేసే ఈ గింజలు కీళ్ల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తాయట..!

ఆర్థరైటిస్ అనేది కీళ్ల నొప్పులు, వాపులు, కదలికలలో ఇబ్బందులతో కూడిన ఆరోగ్య సమస్య. ఇది ముఖ్యంగా వయసుతో పాటు వచ్చే సమస్యగా భావించబడుతున్నా.. ప్రస్తుతం యువతలోనూ ఇది అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నా.. దీర్ఘకాలంగా ఉండే నొప్పులు, రోజువారీ పనులకు అంతరాయం కలిగించడం వంటివి దీనిని తక్కువ చేసి చెప్పలేని సమస్యగా మార్చాయి. అయితే ఈ సమస్యకు ఆయుర్వేదంలో సహజ చికిత్సలు ఉన్నాయి.

మనం నిర్లక్ష్యం చేసే ఈ గింజలు కీళ్ల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తాయట..!
Arthritis Pain Relief
Prashanthi V
|

Updated on: Apr 23, 2025 | 1:02 PM

Share

ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని సహజ చిట్కాలు ఆర్థరైటిస్ బాధితులకు విశేష ఉపశమనం కలిగిస్తాయి. వాటిలో ముఖ్యమైనది చింతగింజల ఉపయోగం. చింతగింజలు.. చాలా మంది వీటిని నిర్లక్ష్యంగా చూసినప్పటికీ.. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగించగలవు. ముఖ్యంగా కీళ్ల సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తాయి.

చింతగింజల్లో టానిన్లు, ఫ్లావనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గల రసాయనాలు ఉండటం వల్ల ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్లలో ఏర్పడే వాపు, గట్టిగా ఉండే నొప్పుల వంటి లక్షణాలను నివారించడంలో ఇవి సహకరిస్తాయి. దీనివల్ల కీళ్ల పనితీరు మెరుగవుతుంది.

చింతగింజలు కీళ్లలో లూబ్రికేషన్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంటే కీళ్ల మధ్య ఉన్న స్నిగ్ధత స్థాయిని నిలబెట్టే పనిలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా కీళ్ల చలనం సాఫీగా ఉంటుంది. నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ల కదలికలపై నియంత్రణ పెరుగుతుంది.

చింతగింజల పొడిని తయారు చేసి ఆయుర్వేద నిపుణుల సూచనలతో పాటు ఉపయోగించాలి. సాధారణంగా ఈ పొడిని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మోతాదు మించకుండా తీసుకోవడం ఎంతో ముఖ్యం.

చింతగింజలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా యోగా, స్విమ్మింగ్ లాంటి మృదువైన వ్యాయామాలు కీళ్ల బలాన్ని పెంచుతాయి. ఇవి కీళ్ల కదలికకు సహకరిస్తాయి. వ్యాయామం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. కీళ్లు దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది.

చింతగింజలతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

ఆర్థరైటిస్ సమస్యను నియంత్రించేందుకు మన పాత సంప్రదాయమైన ఆయుర్వేదంలో ఎన్నో సహజ మార్గాలు ఉన్నాయి. వాటిలో చింతగింజలు ముఖ్యమైనవి. సహజంగా లభించే ఈ చిన్న గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సరైన ఉపయోగంతో పాటు వ్యాయామం, తగిన ఆహారం తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్యను నియంత్రించడం పూర్తిగా సాధ్యమే.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)