NEET PG 2023: జనవరి 23న నీట్‌ పీజీ 2023 ప్రవేశ పరీక్ష..? వచ్చే నెలలో అధికారిక ప్రకటన..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NEET PG 2022) పీజీ 2023 ప్రవేశ పరీక్ష జనవరి 23 తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. ఐతే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) మాత్రం..

NEET PG 2023: జనవరి 23న నీట్‌ పీజీ 2023 ప్రవేశ పరీక్ష..? వచ్చే నెలలో అధికారిక ప్రకటన..
Neet Pg 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2022 | 7:18 AM

NEET-PG 2023 exam date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NEET PG 2022) పీజీ 2023 ప్రవేశ పరీక్ష జనవరి 23 తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. ఐతే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) మాత్రం ఇంకా అధికారికంగా పరీక్ష తేదీని ప్రకటించలేదు. అధికారికంగా వచ్చే నెలలో ప్రకటన వెలువడుతుంది. ఏడాది మొదట్లోనే పరీక్ష తేదీని ప్రకటిస్తే నీట్‌ అడ్మిషన్‌ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా గత రెండేళ్లుగా కరోనా కారణంగా నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్‌ ప్రక్రియలు సకాలంలో నిర్వహించలేకపోయిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి నీట్‌ పరీక్ష ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఎన్‌బీసీ అధికారులు భావిస్తున్నారు.

దీంతో వచ్చే యేడాది నీట్‌ పీజీ 2023 పరీక్ష తేదీని తాత్కాలికంగా వెలువరించింది. నీట్‌ పీజీ పరీక్షల ఫార్మాట్‌ను మార్చబోతున్నారనే ఊహాగానాలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఐతే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంతవరకూ ఎమ్‌సీసీ ప్రకటించలేదు. పాత ఫార్మాట్‌ ప్రకారంగానే పరీక్ష జరుగుతుంది. ఇతర పూర్తి సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ natboard.edu.inలో చేసుకోవచ్చు. ఇక NEET PG 2022 సంబంధించి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. స్కోర్‌ కార్డులను కూడా బోర్డు విడుదల చేసింది. నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ హెడ్యూల్‌ మాత్రం ఇంకా ప్రకటించలేదు. మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) కౌన్సెలింగ్ తేదీలపై పని చేస్తోంది. అనంతరం త్వరలోనే దాని అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.inలో షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి