AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSCHE: తెలంగాణ హైయర్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 5,083 ఖాళీలు.. ఏయే పోస్టులున్నాయంటే..

తెలంగాణ ఉన్నత విద్యా విభాగంలో దాదాపు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది...

TSCHE: తెలంగాణ హైయర్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 5,083 ఖాళీలు.. ఏయే పోస్టులున్నాయంటే..
Tsche
Srilakshmi C
|

Updated on: Jun 14, 2022 | 2:16 PM

Share

Job Vacancies in Telangana Higher Education Department 2022: తెలంగాణ ఉన్నత విద్యా విభాగంలో దాదాపు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిల్లో అత్యధికంగా యూనివర్సిటీల్లోనే 1892 వరకు టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెల్పింది.

  • మొత్తం 11 యూనివర్సిటీల్లో 2374 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో టీచింగ్‌ పోస్టులు1892, నాన్‌ టీచింగ్‌ పోస్టులు 482, ఇంటర్మీడియట్‌ బోర్డు- జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 52, తెలంగాణ ఆర్కైవ్స్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోస్టులు 20 ఉన్నాయి.
  • ఇక ఇంటర్మీడియట్‌ కమిషనరేట్‌లో మొత్తం 1,523ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 1392, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 91, లైబ్రేరియన్‌ పోస్టులు 40 ఉన్నాయి.
  • కళాశాల విద్య కమిషనరేట్‌లో 546 ఉండగా.. వాటిల్లో లెక్చరర్‌ పోస్టులు 491, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 29, లైబ్రేరియన్‌ పోస్టులు 24, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2 ఉన్నాయి.
  • సాంకేతిక విద్య కమిషనరేట్‌లో మొత్తం 568 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో లెక్చరర్ పోస్టులు 247, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 37, లైబ్రేరియన్‌ పోస్టులు 31, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 12, జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు 14, ఎలక్ట్రీషియన్‌ పోస్టులు 25, మాట్రన్‌ పోస్టులు 5, ల్యాబ్‌ అటెండర్‌ పోస్టులు 197 ఖాళీగా ఉన్నాయి.

ఈ మేరకు ఖాళీల వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో వీటి భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.