TS Govt Jobs 2022: 1326 వైద్యుల పోస్టులకు నేడో, రేపో తెలంగాణ వైద్య శాఖ నోటిఫికేషన్!
నేడో, రేపో 1,326 వైద్యుల నియామకాలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వైద్ నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విద్య, ప్రజారోగ్య..
Telangana to recruit 1,326 MBBS doctor posts: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలు భర్తీకి సంబంధించి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు విడుదలౌతున్నాయి. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 (TSPSC Group 1)తో సహా పలు యూనీఫాం పోస్టులకు పోలీసు శాఖ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో రాత పరీక్షకు సంబంధించిన తేదీలు ప్రకటించనున్నారు. దీనిలో భాగంగా నేడో, రేపో 1,326 వైద్యుల నియామకాలకు వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వైద్ నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విద్య, ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు, ఐపీఎం విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఎంబీబీఎస్ అర్హత గల ఈ పోస్టులను రాత పరీక్షలేకుండా నేరుగా వారి అర్హత, అనుభవం, వెయిటేజీ ఆధారంగా తీసుకుంటారు. అవుట్‌సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజ్ మార్కులు ఉంటాయి.
కాగా తెలంగాన వైద్యఆరోగ్యశాఖ (Telangana Medical dept jobs)లో ప్రకటించిన మొత్తం 12,755 పోస్టుల్లో వైద్యులు సహా నర్సులు, ఇతర సిబ్బందిని వైద్య నియామక సంస్థ ద్వారానే భర్తీ చేయాలని వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే నిర్ణయించింది. జూనియర్ అసిస్టెంట్ల వంటి పాలనాపరమైన పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ (TSPSC)ద్వారా భర్తీ చేయనున్నారు. తొలుత ఎంబీబీఎస్ అర్హత గల 1,326 వైద్యులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత నర్సుల పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద సుమారు 4000 నర్సుల పోస్టులున్నట్లు సమాచారం. ఇక వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని ఆసుపత్రుల్లో 3300 వరకు స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇవికాకుండా 1700 ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్‌లు, ఇతర పాలనాపర ఖాళీలు భర్తీ చేయాలి.
వైద్యుల పోస్టులు మినహా, నర్సులు సహా మిగిలిన పోస్టులన్నింటికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రాతిపదికన ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి అనుభవం, వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని తుది నియామకాలు జరుపుతారు. ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికీ వెయిటేజీ ఇవ్వాలనే సమాలోచనల్లో ఉన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.