TS Inter Resutls 2022: రేపు ఇంటర్మీడియట్ ఫలితాలంటూ నెట్టింట ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు!

Srilakshmi C

Srilakshmi C | Edited By: Venkata Chari

Updated on: Jun 14, 2022 | 2:42 PM

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు గమనిక! తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్‌ ఫలితాలను జూన్‌ 15న ప్రకటించనున్నట్లు నెట్టింట్లో వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ న్యూస్‌పై ఓ క్లారిటీ వచ్చింది.

TS Inter Resutls 2022: రేపు ఇంటర్మీడియట్ ఫలితాలంటూ నెట్టింట ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు!
Ts Inter Results

Telangana intermediate result date 2022: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు గమనిక! తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్‌ ఫలితాలను జూన్‌ 15న విడుదలవుతాయంటూ సోషల్ మీడియాలో వార్తుల చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఈ వార్తలపై తెలంగాణ ఇంటర్ బోర్డు మంగళవారం క్లారిటీ ఇచ్చింది. సదరు వార్తలన్నీ వాస్తవం కాదని, విద్యార్ధులు వాటిని నమ్మవద్దని, ఫలితాలు విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ఫలితాల అనంతరం పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ sbie.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. సమాధానల పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో చేపట్టారు. కాగా కోవిడ్‌ కారణంగా గతేడాది ఆల్‌పాస్‌ ఫార్ములాను ప్రకటించిన ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది పరీక్షల ఫలితాలను త్వరలో ప్రకటించనుంది. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఐతే ఈ పరీక్షలు ప్రారంభమయినప్పనుంచి క్వశ్చన్‌ పేపర్లలో అక్షర దోషాలు, చేతితో రాసిన క్వశ్యన్‌ పేపర్ల పంపిణీ, ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష పేపర్లను విద్యార్ధులకు ఇవ్వడం.. ఇలా పలురకాలుగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలతో వార్తల్లో నిలిచింది.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే.. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన ఫలితాలు (TS 10th Class Results 2022) జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు జూన్ 1కి బదులుగా కాలేజీలు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu