Telangan Schools: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్ 13) నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం..
Telangan Schools reopend today: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్ 13) నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పాఠశాలలను సందర్శించారు. సారంగాపూర్ మండలంలోని రాంపూర్‌లో ప్రాథమిక, అంగన్ వాడీ పాఠశాలలను, దర్యాపూర్‌లోని ప్రాథమికోతన్నత పాఠశాలను పరిశీలించారు.
కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్ధుల ప్రావీణ్యాన్ని పరీక్షించారు. చిన్నారులతో ఏబీసీడీలు చెప్పించి, రైమ్స్ పాడిపించి విద్యార్థులను అభినందించారు. ఆ తర్వాత పాఠశాలలో కొవిడ్ నిబంధనల అమలు తీరు, తరగతి గదుల్లో విద్యార్థుల సీటింగ్, హాజరు శాతాన్ని పరిశీలించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యను అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
కాగా ఆదివారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్కూళ్ల పునఃప్రారంభవిషయమై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలన్నీ సోమవారం నుంచి తెరచుకుంటాయని, పంచాయితీ సర్పంచ్‌లు, మంత్రులు, ఇతర నాయకులు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. దీనిలో భాగంగా ఈ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాఠశాలలను సందర్శించారు.