Left-handed people: ఎడమచేతివాటం వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?..అందుకే యూఎస్ ప్రెసిడెంట్లుగా..

మీ సన్నిహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎడమచేతి వాటం ఉన్నవారు ఉన్నారా? వీరికి - అమెరికా ప్రెసిడెంట్లకు కొన్ని ముఖ్యమైన పోలికలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Left-handed people: ఎడమచేతివాటం వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?..అందుకే యూఎస్ ప్రెసిడెంట్లుగా..
Us Presidents
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 13, 2022 | 11:29 AM

left-handed personality characteristics: కొంత మందికి పుట్టుకతోనే ఎడమచేతి వాటం ఉంటుంది. అంటే రాయడం నుంచి ప్రతీ పని ఎడమచేతితోనే చేస్తుంటారన్నమాట. నిజానికి ఈ ప్రపంచం కుడి చేతివాటమున్న వారికోసం సృష్టించబడింది. మరి ఎడమచేతి వ్యక్తుల పరిస్థితేంటి?  knowledge is power అనే మాట వీరి విషయంలో నూటికి నూరు పాళ్లు నిజమని నిరూపితమవుతుంది. ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు మరింత స్వతంత్రంగా జీవిస్తారని వీరిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొన్ని మీ కోసం..

భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5-10% మంది ఎడమచేతి వాటం జనాభా ఉన్నారు.

Alcohol

Alcohol

కుడి చేతివాటం వారితో పోల్చితే వీరిలో మద్యపానం అలవాటు మూడు రెట్లు ఎక్కువ.

ఇవి కూడా చదవండి

మెదడులో కుడి భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Puberty

Puberty

సాధారణ మనుషులకంటే  వీరిలో 4-5 నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత ఉంటుంది.

Tennis

Tennis

క్రీడల్లో వీరికి మక్కువ ఎక్కువ. టాప్‌ టెన్నీస్‌ ప్రేయర్లలో 40శాతం ఎడమచేతివాటం వారే ఉండటం గమనార్హం.

Us Presidents

Us Presidents

26 యూఎస్ ప్రెసిడెంట్లలో 8 మంది ఎడమచేతి వాటంవారే.

Left Handed Baby

Left Handed Baby

40 యేళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చితే పుట్టే పిల్లల్లో 128 శాతం ఎడమచేతి వాటం ఉన్న శిశువులు జన్మిస్తున్నారు.

కుడి చేతివాటం వాళ్లు మాటలు చెప్పడంలో మేటి. ఐతే ఎడమచేతివాటం వారు గణితం, అర్కిటెక్చర్‌లో మరింత ప్రతిభావంతులు.

అమెరికా మొత్తం జనాభాలో 30 మిలియన్ల ప్రజలు ఎడమచేతి వాటంవారే!

Allergies

Allergies

కుడి చేతి వాటం వారితో పోల్చితే ఎడమచేతివాటం వారు అలర్జీ, ఆస్తమా వ్యాధుల భారీన ఎక్కువగా పడుతుంటారు.

బ్రిటీష్ రాజకుటుంబంలో ఎడమ చేతివాటం కలిగిన రాణులున్నారు. క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీరంతా ఎడమచేతివాటం కలిగినవారే.

వీరిలో నిద్రలేమి (insomnia) సమస్య ఎక్కువ.

ఆగస్టు 13న International Left-Handers Dayగా జరుపుకుంటారు.

Left Hand People

Left Hand People

బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం వారే.

నెర్వస్ అండ్‌ మెంటల్‌ డిసీజ్‌ జర్నల్‌ అధ్యయనాల్లో కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం కలిగిన వారికి కోపం ఎక్కువ అని తేలింది.

మీ సన్నిహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎడమచేతి వాటం ఉన్నవారు ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో.. సరదాగా గమనించండి.