AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Schools Reopen 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోగిన బడి గంటలు..

వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ..

TS Schools Reopen 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోగిన బడి గంటలు..
Schools Reopen
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 6:43 PM

Share

TS schools reopen from June 13: వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతన్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. జూన్‌ 13వ తేదీ నుంచి యథావిథిగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసంది.

రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్‌, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్లో మరో 2.5లక్షల మంది విద్యార్ధులున్నారు. ఒక 10,800ల ప్రైవేటు స్కూళ్లలో దాదాపు 32లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. మొత్తం 60 లక్షల మంది నేటి నుంచి బడి బాట పట్టనున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యాసంవత్సరంలోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మర ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల్లో ఆంగ్ల బోధన మొదలవనుంది.

ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 80,000ల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. అంతేకాకుండా రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది. ఐతే సరిపడా ముద్రించలేదని సమాచారం. మరోవైపు స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత, బోధనేతర సిబ్బంది కూడా అరకొరగా ఉన్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యూనీఫారాలు ఇస్తారో లేదోననే మీమాంస లేకపోలేదు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇన్ని సమస్యల మధ్య ఈ ఏడాది విద్యారంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళన వెంటాడుతోంది.

ఇవి కూడా చదవండి