CIMFR Dhanbad Recruitment 2022: సీఎస్‌ఐఆర్-సీఐఎమ్‌ఎఫ్‌ఆర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (CSIR - CIMFR).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
CSIR – CDRI Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని సీఎస్‌ఐఆర్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (CSIR – CIMFR).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000 నుంచి రూ.42,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్/ గేట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.
అడ్రస్: సీఐఎంఎఫ్‌ఆర్, పోస్ట్ – బర్వా రోడ్, ధన్‌బాద్, ఝార్ఖండ్.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 20 నుంచి 27 వరకు, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.