BECIL Recruitment: బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వరంగ సంస్థ.. బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్...
BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వరంగ సంస్థ.. బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 123 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, జూనియర్ వార్డెన్, స్టోర్‌కీపర్, జేఈ, ఫార్మసిస్ట్, ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైటీషియన్, డెంటల్ టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత టెక్నికల్ కోర్సుల సర్టిఫికెట్లతో పాటు పని అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13,290 నుంచి రూ. 35,400 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…