Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Company: ఇంట్లో 100 బొద్దింకలను పెంచండి.. రూ. 1.5 లక్షల గిఫ్ట్ పట్టేయండి.. కండిషన్స్ అప్లై

ఒక అమెరికన్ కంపెనీ బొద్దింకలు విషయంలో చాలా విచిత్రమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఆ ఆఫర్ గురించి తెలిస్తే.. ప్రజలు షాక్ తింటారు. 100 బొద్దింకలను పెంచే కుటుంబానికి ఓ కంపెనీ లక్షన్నర రూపాయలను ఆఫర్ చేస్తోంది.

US Company: ఇంట్లో 100 బొద్దింకలను పెంచండి.. రూ. 1.5 లక్షల గిఫ్ట్ పట్టేయండి.. కండిషన్స్ అప్లై
North Carolina Company
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2022 | 7:45 AM

US Company: ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు లక్షలాది మంది ఉన్నారు. పెంపుడు జంతువులను, పక్షులను మాత్రమే కాదు… అడివిలో కౄర జంతువులను సైతం ప్రేమించి వాటిని రక్షించేవారు అనేకమంది ఉన్నారు. ఇక  కుక్కలు, పిల్లులను సొంతం కుటుంబ సభ్యుల భావించి వాటిని ఎక్కువమంది పెంచుకోవడంలో ఆసక్తిని చూపిస్తారు. వీటికి మనిషి గొప్ప అనుబంధం ఉంటుంది. వీటిని మాత్రమే కాదు ఆవులు, మేకలు, కుందేలు, గుర్రాలు, ఏనుగులు వంటి జంతువులను కూడా పెంచుకుంటారు.. అయితే ఎవరైనా బొద్దింకలను కూడా ఇంట్లో పెంచుకోవడం మొదలు పెట్టారు.   నిజానికి బొద్దింకలు ఇంట్లో కనిపిస్తే.. చాలు వాటిని చంపేవరకూ నిద్రపోరు ఇంటి సభ్యులు ఎందుకంటే అవి వంటగదిలో ఆహారపదార్ధాలను నాశనం చేస్తాయి. అందుకనే ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే చాలు.. వెంటనే మార్కెట్లోకి పెస్టిసైడ్స్ కోసం పరిగెడతారు. అయితే ఒక అమెరికన్ కంపెనీ బొద్దింకలు విషయంలో చాలా విచిత్రమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఆ ఆఫర్ గురించి తెలిస్తే.. ప్రజలు షాక్ తింటారు.  100 బొద్దింకలను పెంచే  కుటుంబానికి ఓ కంపెనీ లక్షన్నర రూపాయలను ఆఫర్ చేస్తోంది. ఇది చాలా విచిత్రమైన విషయం. బొద్దింకలను పెంచడానికి ఒక కంపెనీ అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అని ఆలోచిస్తున్నారా.. దీని వల్ల ఏమి ఉపయోగం? ఆ కంపెనీ ఎందుకు ఇలా బొద్దింకలు పెంచమని కోరుతుంది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎందుకంటే ఎవరూ ఎటువంటి కారణం లేకుండా లక్షల రూపాయలు ఖర్చు చేయరు. అది కూడా బొద్దింక వంటి పనికిరాని జీవిని పెంపకం చేయడానికి.

బొద్దింకలు ఎందుకు అవసరం అంటే..?  డైలీ స్టార్ పత్రిక  నివేదిక ప్రకారం..  నార్త్ కరోలినాలోని ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ తన కొత్త ఔషధాన్ని పరిశోధిస్తోంది. ఈ పరిశోధనకు బొద్దింకలు చాలా అవసరం. పురుగులను నిర్మూలించడంలో ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో  తెలుసుకోవడానికి కంపెనీ ఆ బొద్దింకలపై మందును పరీక్షిస్తుంది. ఇందుకోసం కంపెనీ బొద్దింకలను పెంచుకునే ఇళ్లను వెతుకుతోంది. కంపెనీ ఆ ఇళ్లలో కనీసం 100 బొద్దింకలను విడుదల చేస్తుంది. ఆ బొద్దింకలనుకదలికలను కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతిఫలంగా కంపెనీ 2 వేల డాలర్లు అంటే దాదాపు 1 లక్షా 56 వేల రూపాయలను ఇంటి యజమానికి ఇస్తుంది.

ఈ పరిశోధన దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. నెల రోజుల తర్వాత ఇంట్లో బొద్దింకలు లేకుండా నిర్ములింపబడితే ఒకే.. లేదంటే.. రీసెర్చ్ పూర్తయ్యాక కంపెనీయే ట్రీట్‌మెంట్ ద్వారా మిగిలిపోయిన బొద్దింకలను తొలగించి ఆ ఇంట్లో మళ్లీ బొద్దింకలు లేకుండా చేస్తుంది. అయితే ఈ రీసెర్చ్‌లో బొద్దింకలను పెంచే ఇళ్లన్నీ అమెరికాలోనే ఉండాలని కంపెనీ షరతు విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..