Lava of Volcano: అగ్నిపర్వతం నుంచి ఎర్రని నీరులా ప్రవహిస్తున్న లావా… షాకింగ్ వీడియో వైరల్..

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..అందులో అగ్నిపర్వతం లావా నీరులా ప్రవహిస్తుంది. వీడియోలో కనిపించిన దృశ్యం చూడడానికి అందంగా కనిపించినా.. అది సృష్టించే విధ్వసం హృదయ విదారకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Lava of Volcano: అగ్నిపర్వతం నుంచి ఎర్రని నీరులా ప్రవహిస్తున్న లావా... షాకింగ్ వీడియో వైరల్..
Lava Of Volcano
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2022 | 9:22 PM

Lava of Volcano Viral Video: ఈ ప్రపంచంలో అందాన్ని ఆనందాన్ని ఇచ్చే ప్రకృతి మాత్రమే కాదు.. ప్రళయాన్ని సృష్టించి.. ప్రపంచాన్ని అంతం చేసే అనేక రకాల ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. కనులు మూసి కనులు తెరచే లోపు మానవాళిని నాశనం చేయగలవు. అయితే ప్రకృతిలోని ఇన్ని ప్రమాదాలున్నా.. మనిషి సాటివారిమీద పై చేయి కోసం మరోవైపు ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేస్తూనే ఉన్నారు.  అయితే, మానవులు ఎన్ని ప్రమాదకరమైన వస్తువులను తయారు చేసినప్పటికీ.. ఎప్పుడూ సహజ వస్తువులతో పోటీ పడలేరని ప్రకృతిలోని విపత్తులు అనేకసార్లు రుజువు చేశాయి.  మానవాళి అంతం అవుతుందా అనిపించే ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడు అనేకం జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు సునామీ, కొన్నిసార్లు వరద, కొన్నిసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ఘటనల గురించి తెలుసు. ముఖ్యంగా అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి మాట్లాడితే.. వెంటనే ఇటలీ సంఘటన గుర్తుకొస్తుంది. సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇటలీలోని ప్రసిద్ధ పాంపీ నగర ప్రజలందరూ రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ప్రకృతి అత్యంత  భయంకరమైన వినాశనాన్ని కలిగించింది. అగ్నిపర్వతంలోని లావా, బూడిదనగరాన్ని రాయిగా మార్చాయి. అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా వేడి ఎంత ప్రమాదకరమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..అందులో అగ్నిపర్వతం లావా నీరులా ప్రవహిస్తుంది.

అగ్నిపర్వతం లావా ఎంత వేగంగా ప్రవహిస్తుందో మీరు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిప్పుల నది ఉన్నట్లు అనిపిస్తుంది. పొరపాటున ఎవరైనా ఈ నదిలోకి వెళ్లినా, అతని శరీరమే కాదు, ఎముకలు కూడా కరిగిపోతాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా ఉష్ణోగ్రత దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని చెబుతున్నారు. అంటే లావా వేడి ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. వీడియోలో కనిపించిన దృశ్యం చూడడానికి అందంగా కనిపించినా.. అది సృష్టించే విధ్వసం హృదయ విదారకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో @CosmicGaiaX అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలియన్లు అంటే 12 లక్షల సార్లు వీక్షించగా, 39 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..