World Record: విచిత్రమైన వరల్డ్ రికార్డ్.. బ్రెడ్‌ను 90 అడుగులకు పైగా విసిరి అద్వితీయమైన ప్రదర్శన చేసిన వ్యక్తి..

Guinness World Record: కొన్ని ఇతర ప్రపంచ రికార్డులు చాలా విచిత్రమైనవి.. అసలు మీరు ఎప్పుడూ ఆలోచించనివి... ఇలా చేసి కూడా ప్రపంచ రికార్డ్ సృషించవచ్చా అని ఆశ్చర్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.

World Record: విచిత్రమైన వరల్డ్ రికార్డ్.. బ్రెడ్‌ను 90 అడుగులకు పైగా విసిరి అద్వితీయమైన ప్రదర్శన చేసిన వ్యక్తి..
Guinness World Record
Follow us

|

Updated on: Jun 12, 2022 | 6:06 PM

Guinness World Record: ప్రపంచంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కొందరైతే బర్గర్ తిని మరికొందరు మిరపకాయలు తింటూ .. ఇంకొందరు.. తమ అభిరుచి మేరకు పంటలను పండిస్తూ.. రికార్డు సృష్టించారు. ఇలా రకారకాల వస్తువులు తింటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఇతర ప్రపంచ రికార్డులు  చాలా విచిత్రమైనవి.. అసలు మీరు ఎప్పుడూ ఆలోచించనివి… ఇలా చేసి కూడా ప్రపంచ రికార్డ్ సృషించవచ్చా అని ఆశ్చర్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. తాజాగా బ్రిటన్ నివాసి ఆలివర్ మైల్స్ అనే వ్యక్తి అలాంటి రికార్డు సృష్టించాడు . రొట్టెలు విసురుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు . ఎవరైనా రోటీ విసిరి ప్రపంచ రికార్డ్ ఎలా చేస్తాడని ఆలోచిస్తున్నారా.. పూర్తి వివరాలోకి వెళ్తే..

ఆలివర్ మైల్స్ 90 అడుగుల ఎత్తులో టోర్టిల్లాను విసిరి ఈ అపూర్వమైన ఫీట్ చేశాడు. టోర్టిల్లా నిజానికి మెక్సికన్ బ్రెడ్.  దీనిని పాన్‌కేక్ అని కూడా పిలుస్తారు. సాధారణ రోటీ కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని దీనిని ఈజీగా దూరంగా విసిరేయడం సులభం.

లాక్ డౌన్ సమయంలో వచ్చిన ఐడియా: మీడియా నివేదికల ప్రకారం.. లాక్‌డౌన్‌లో ఖాళీగా కూర్చున్నప్పుడు రోటీ విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాలనే ఆలోచన ఆలివర్‌కు వచ్చిందట. ఈ క్రమంలో యూట్యూబ్‌లో ఓ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారిగా తన మనసులో కొత్తదనాన్ని, ప్రత్యేకతను ఎందుకు ప్రయత్నించకూడదనే ఆలోచన వచ్చిందని ఆలివర్ మైల్స్ చెప్పాడు. అంతేకాదు డేవిడ్ రష్   ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలనీ భావించి అందుకు తగిన విధంగా సన్నాహాలు మొదలు పెట్టాడు. అంతే ఇప్పుడు  టోర్టిల్లాను అత్యధిక ఎత్తుకు విసిరి రికార్డు సృష్టించడమే కాదు.. మునుపటి రికార్డును బద్దలు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

డేవిడ్ రష్ రికార్డు బ్రేక్: ఆలివర్ కంటే ముందు.. ఈ ప్రత్యేక రికార్డు డేవిడ్ రష్ పేరిట ఉంది. అతను టోర్టిల్లాను 54 అడుగుల ఎత్తుకు విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరగా, ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి.. ఆలివర్ 90 అడుగుల వరకు టోర్టిల్లాను విసిరి సరి కొత్త రికార్డును  సృష్టించాడు.

నిజానికి డేవిడ్ రష్ ఒక ప్రసిద్ధ రికార్డ్ బ్రేకర్. ఒకటి రెండు కాదు ఏకంగా 200కు పైగా ప్రపంచ రికార్డులు సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. తాజాగా 111 టీ షర్టులు ధరించి మారథాన్ రేసును పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

మరిన్ని టెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..