Hyderabad: చార్మినార్‌ వద్ద కరెన్సీ నోట్ల వర్షం..! ఎగబడి ఎరుకున్న స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులు, వీడియో వైరల్‌

హైదరాబాద్ పాతబస్తీలో రాత్రివేళ కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. నడిరోడ్డుపై కనిపించిన నోట్లను ఎరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఈ వీడియోపై హైదరాబాద్‌ పోలీసులు ఆరా చేపట్టారు.

Hyderabad: చార్మినార్‌ వద్ద కరెన్సీ నోట్ల వర్షం..! ఎగబడి ఎరుకున్న స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులు, వీడియో వైరల్‌
Cash Rain
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 7:18 PM

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో రాత్రివేళ కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. నడిరోడ్డుపై కనిపించిన నోట్లను ఎరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఈ వీడియోపై హైదరాబాద్‌ పోలీసులు ఆరా చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే…చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుల్జార్‌హౌజ్‌ ఫౌంటెన్‌ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

జూన్ 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మదీనా వైపు నుంచి గుల్జార్‌హౌజ్‌ వైపు వచ్చిన నాలుగైదు కార్లలో యువకులు కార్లను రోడ్డుపై నిలిపి ఫౌంటెయిన్‌ వద్దకు వచ్చి రూ.20 నోట్లను వెదజల్లారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పడిన కరెన్సీ నోట్లను ఎగబడి అందుకున్నారు. అనంతరం ఆ యువకులు కాలికమాన్‌ వైపు వెళ్లిపోయారు.

ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు ఆరా తీశారు. పెండ్లి బరాత్‌ ముగించుకొని వస్తుండగా దారి మధ్యలో యువకులు గుల్జార్‌హౌజ్‌ ఫౌంటెన్‌ వద్ద కాసేపు ఆగి, కరెన్సీ నోట్లు వెదజల్లినట్టుగా చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ గురు నాయుడు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి