Viral Video: ఈ ఎలుగుబంటికి ట్రాఫిక్‌ సెన్స్‌ ఎక్కువే.. రోడ్డుపై ట్రాఫిక్‌ కోన్‌ను ఎలా సరి చేసిందో మీరే చూడండి..

Bear Video: ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో పడి చాలామంది ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలను అసలు పట్టించుకోరు. ఎప్పుడెప్పుడూ గమ్య స్థానానికి చేరుకుందామా అన్న ఆతృత తప్పనిస్తే.. ట్రాఫిక్‌ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ అసలు పట్టవు...

Viral Video: ఈ ఎలుగుబంటికి ట్రాఫిక్‌ సెన్స్‌ ఎక్కువే.. రోడ్డుపై ట్రాఫిక్‌ కోన్‌ను ఎలా సరి చేసిందో మీరే చూడండి..
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2022 | 7:49 PM

Bear Video: ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో పడి చాలామంది ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలను అసలు పట్టించుకోరు. ఎప్పుడెప్పుడూ గమ్య స్థానానికి చేరుకుందామా అన్న ఆతృత తప్పనిస్తే.. ట్రాఫిక్‌ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ అసలు పట్టవు. ఇలాంటివారికి ఓ మూగ జంతువు ఆదర్శంగా నిలుస్తోంది. ఈక్రమంలో ఓ ఎలుగుబంటి ప‌డిపోయిన ట్రాఫిక్ కోన్ క‌నిపించ‌గానే స‌రిచేసి వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను బిటింగెబిడెన్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో ఓ ఎలుగుబంటి దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటుంది. రోడ్డు పక్కన ట్రాఫిక్ కోన్ ప‌డిపోయి క‌నిపించ‌గానే, అక్కడే ఆగిపోతుంది. ఆ ట్రాఫిక్ కోన్ అలా పడిపోయుండటాన్ని ఆ ఎలుగుబంటి సహించలేకపోయింది. అందుకే నిటారుగా నిలబెట్టి మరీ ముందుకెళ్లింది.

గుడ్ సిటిజన్..

ఇవి కూడా చదవండి

అమెరికాలోని అల‌స్కాలోగ‌ల డెనాలి నేష‌న‌ల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఇది రికార్డైంది.ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ పార్క్‌లో ఉండే ఎలుగుబంట్లు, తోడేళ్లు, తదితర జంతువులు ఇలాగే రోడ్లపై తిరుగుతుంటాయంటూ.. అందులో భాగంగానే యాదృచ్ఛికంగా సీసీటీవీ కెమెరాల్లో ఇది రికార్డైందని పార్క్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఎలుగుబంటి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎలుగుబంటికున్న ట్రాఫిక్‌ సెన్స్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఈ వీడియోకు భారీగా లైక్స్ వచ్చి పడుతున్నాయి. రీట్వీట్ల మీద రీట్వీట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున కామెంట్లు కూడా వస్తున్నాయి. ‘కేవలం ఎలుగుబంటే కానీ.. గుడ్ సిటిజన్’, ‘కొందరు మనుషులు ఈ మూగజీవిని చూసి నేర్చుకోవాలి’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ 20 మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బవుమా.. టీమిండియా ప్లేయింగ్‌- XI ఎలా ఉందంటే..

Major Movie: అడివిశేష్‌ సినిమాను చూసిన మేజర్‌ సందీప్‌ సహోద్యోగి.. నిజమైన శాండీ సార్‌ను చూశానంటూ..

విమాన ప్రయాణంలో వీటిని తింటే అంతే సంగతులు.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..