Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: భర్తకు కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన నయన్.. కళ్లు చెదిరే కానుకలు ఇచ్చుకున్న క్యూట్ కపుల్..

Nayanthara- Vignesh Wedding: ఏడేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ పెళ్లిపీటలెక్కారు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara)-దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). జూన్‌ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్‌ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.

Nayanthara: భర్తకు కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన నయన్.. కళ్లు చెదిరే కానుకలు ఇచ్చుకున్న క్యూట్ కపుల్..
Nayanthara Vignesh Wedding
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2022 | 10:11 PM

Nayanthara- Vignesh Wedding: ఏడేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ పెళ్లిపీటలెక్కారు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara)-దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). జూన్‌ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్‌ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. షారుఖ్ ఖాన్, నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, కార్తీ, సూర్య, రజినీ కాంత్, విజయ్ దళపతితోపాటు పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. కాగా ఈ క్యూట్‌ కపుల్‌కి సంబంధించి నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పెళ్లికి ముందు వీరిద్దరు ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నారట. ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని పాతిక కోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిందట. ఆ ఇంటిని తన భర్త పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి బహుమతిగా ఇచ్చిందట. అలాగే.. తన భర్త సోదరి ఐశ్వర్యకు సైతం దాదాపు 24 తులాల బంగారు నగలను గిఫ్ట్‌గా ఇచ్చిందని సమాచారం. దీంతోపాటు దగ్గరి బంధువులకి సైతం నయనతార విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

లక్షమందికి విందు భోజనాలు.. ఇక బహుమతులు ఇవ్వడంలో విఘ్నేష్ సైతం ఏ మాత్రం తక్కువ చేయలేదట. వివాహ వేడుకలో నయన్‌ ధరించిన రూ.2.5 నుంచి 3 కోట్లు విలువ చేసే నగలను విఘ్నషే కొన్నాడట.అంతేకాకుండా రూ.5 కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్‌ను కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలో ఎంతో ముఖ్యమైన మంగళసూత్రాన్ని స్వయంగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తన చేతుల మీదుగా వధూవరులకీ అందించిన సంగతి తెలిసిందే. కాగా పెళ్లి రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదానం నిర్వహించారు నయనతార దంపతులు. నిరుపేదలకు, వృద్ధులకు, అనాధలకు, చిన్నారులకు విందుభోజనం వడ్డించారు. సుమారు లక్షమందికి భోజనం అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరు చేసిన మంచి పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Jammu And Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు..

Viral Video: కట్నం ఇచ్చి మరీ ఆడమేకతో కల్యాణం.. కారణమేంటో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోద్ది..

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలెర్ట్.. ఆదివారం పలు మార్గాల్లో రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..