Viral Video: కట్నం ఇచ్చి మరీ ఆడమేకతో కల్యాణం.. కారణమేంటో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోద్ది..

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోతున్నారు. వాట్సప్‌, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Viral Video: కట్నం ఇచ్చి మరీ ఆడమేకతో కల్యాణం.. కారణమేంటో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోద్ది..
Basha Shek

|

Jun 11, 2022 | 8:38 PM

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోతున్నారు. వాట్సప్‌, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ వ్యక్తి కూడా రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలనుకున్నాడు. అందుకోసం ఎవరూ చేయని ఓ వింత పని చేశాడు. సోషల్ మీడియాలో అటెన్షన్‌ కోశం ఆడమేకను పెళ్లి చేసుకుని ఆ వీడియోను నెట్టింట్లో ఉంచాడు. అయితే అందరూ తిట్టిపోయడంతో నాలుక కర్చుకున్నాడు. క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండోనేషియాలోని తూర్పు జావాలోని గ్రెసిక్‌కు చెందిన సైఫుల్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఓ యూట్యూబర్. నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జూన్ 5న గ్రేసిక్‌లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో రహయు బిన్ బెజో అనే పేరుగ‌ల ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు.

వివాహ వేడుకను వీడియో షూట్‌ కూడా తీశాడు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో ఆరిఫ్ సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించగా, మేకను శాలువాతో అలంకరించారు. స్థానికులు కూడా ఈ పెళ్లికి హాజరుకావడం కొసమెరపు. అంతేకాదు వరుడు ఆడ మేకకు రూ.22 వేలను కట్నంగా ఇచ్చాడట. ఆరిఫ్ కోరుకున్నట్లే ఈ వీడియో వైరలైందీ కానీ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్‌ మీడియాలో అటెన్షన్‌ కోసం ఇంతలా దిగజారుతావా?, ఇదొక అసహ్యకరమైన కంటెంట్‌ అంటూ తిట్టిపోస్తున్నారు. ‘ ఇలా పెళ్లి చేసుకునే వారిని మాత్రమే నిందించకూడదు, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోన్న గ్రామపెద్దలు, స్థానికులపై కూడా చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సైఫుల్ దిగివచ్చాడు. అంద‌రికీ క్షమాపణలు చెప్పాడు. వినోదం కోసం మాత్రమే ఇలా చేశానని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో చేయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలెర్ట్.. రేపు పలు మార్గాల్లో రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..

High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Rahul Srivatshav: చెస్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు.. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్ శ్రీవాత్సవ్..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu