Rahul Srivatshav: చెస్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు.. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్ శ్రీవాత్సవ్..

Chess: తెలంగాణకు చెందిన పెద్ది రాహుల్‌ శ్రీవాత్సవ చెస్‌లో సత్తా చాటాడు. ఇటలీలోని కటోల్లికాలో జరుగుతున్న చెస్ ఫెస్టివల్‌ -2022 టోర్నీ లో సత్తాచాటి భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించాడు.

Rahul Srivatshav: చెస్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు.. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్ శ్రీవాత్సవ్..
Rahul Srivatshav
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2022 | 5:55 PM

Chess: తెలంగాణకు చెందిన పెద్ది రాహుల్‌ శ్రీవాత్సవ చెస్‌లో సత్తా చాటాడు. ఇటలీలోని కటోల్లికాలో జరుగుతున్న చెస్ ఫెస్టివల్‌ -2022 టోర్నీ లో సత్తాచాటి భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించాడు. 19 ఏళ్ల రాహుల్‌ కటోలికా ఈవెంట్‌లో గ్రాండ్‌మాస్టర్ లెవాన్ పంతులాయాతో జరిగిన 8వ రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. తద్వారా గ్రాండ్‌ మాస్టర్‌ హోదాకు అవసరమైన 2,500 ఎలో లైవ్ రేటింగ్ మార్కును చేరుకున్నాడు. ‘100 మంది గ్రాండ్‌మాస్టర్‌లను పొందేందుకు భారత్ మరో అడుగు ముందుకేసింది. ఎలైట్ క్లబ్‌లో మరొకరు చేరారు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల రాహుల్ శ్రీవాత్సవ్ భారతదేశ 74వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. రాహుల్, అతని కోచ్, కుటుంబ సభ్యులకు కంగ్రాట్స్‌’ అంటూ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ ఈ సందర్భంగా రాహుల్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

మేడ్చల్‌ జిల్లా కొంపల్లికి చెందిన పెద్ది రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఈ ఏడాది జనవరిలోనే చెస్‌లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా (ఐఎం)గా అవతరించాడు. తద్వారా తెలంగాణలో అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సత్తా చాటాడు. అదేవిధంగా దేశంలో మూడో, ప్రపంచంలో తొమ్మిదో పిన్న వయస్కుడైన ఐఎంగా నిలిచాడు.కాగా ఈ ఏడాది జనవరిలో చెన్నైకు చెందిన భరత్ సుబ్రమణ్యం భారత 73వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్‌మాస్టర్‌ హోదాను పొందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IND vs SA: అట్లుంటది మరి నాతోని.. ఉమ్రాన్‌ స్పీడ్‌కు విరిగిపోయిన పంత్‌ బ్యాట్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Minister Roja: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటున్న మంత్రి రోజా

Major Movie: మేజర్‌ సినిమాపై బిగ్‌ బి ట్వీట్‌.. మహేశ్‌, శేష్‌ల రియాక్షన్‌ ఏంటంటే..