AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మ్యాచ్‌ మధ్యలో పిచ్‌ మీదకు వచ్చిన అభిమాని.. మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చి పంపిన స్టార్‌ క్రికెటర్‌.. ఫిదా అవుతోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

Pak vs WI: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొందరు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకొస్తుంటారు. తమ అభిమాన క్రికెటర్లను కలుసుకోవాలని, వారికి షేక్‌ హ్యాండ్ ఇవ్వాలని ఆరాటపడిపోతుంటారు. అందుకు తగ్గట్లే క్రికెటర్లు కూడా తమ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం నిరాశపర్చకుండా ..

Viral Video: మ్యాచ్‌ మధ్యలో పిచ్‌ మీదకు వచ్చిన అభిమాని.. మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చి పంపిన స్టార్‌ క్రికెటర్‌.. ఫిదా అవుతోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..
Pak Vs Wi
Basha Shek
|

Updated on: Jun 11, 2022 | 6:19 PM

Share

Pak vs WI: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొందరు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకొస్తుంటారు. తమ అభిమాన క్రికెటర్లను కలుసుకోవాలని, వారికి షేక్‌ హ్యాండ్ ఇవ్వాలని ఆరాటపడిపోతుంటారు. అందుకు తగ్గట్లే క్రికెటర్లు కూడా తమ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం నిరాశపర్చకుండా వారితో చేయి కలపడాలు, హత్తుకోవడాలు వంటివి చేస్తుంటారు.  తాజాగా ఓ పాక్‌ అభిమాని కూడా అలాగే చేశాడు. సెక్యూరిటీ కళ్లు గప్పి మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానంలోకి దూసుకొచ్చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ వద్దకు వెళ్లి సెల్యూట్‌ చేశాడు. దీనికి ఆ క్రికెటర్ మొదట షాకైనా అభిమానికి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందరూ ఆ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలేవో తెలుసుకుందాం రండి.

బయోబబుల్ లో ఉన్నా..

ఇవి కూడా చదవండి

కాగా వెస్టిండీస్‌ జట్టు ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ముల్తాన్‌ వేదికగా పాక్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డేలో 120 పరుగుల తేడాతో విజయం సాధించింది పాక్‌ జట్టు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ 9 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఓ వ్యక్తి హఠాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. క్రీజులో ఉన్న షాదాబ్‌ వద్దకెళ్లి సెల్యూట్‌ చేశాడు. దీంతో ఆ పాక్‌ క్రికెటర్‌ మొదట షాకైనా ఆ తర్వాత అంతే ఆప్యాయంగా అ అభిమానిని హత్తకున్నాడు. దీనికి ఉప్పొంగిపోయిన ఆ అభిమాని రెండు చేతులు ఊపుకుంటూ గంతులేస్తూ మైదానం నుంచి బయటకు వచ్చాడు. ఈ సంఘటనను చూసి స్టేడియంలోని ప్రేక్షకులందరూ షాదాబ్‌ ఖాన్‌కు మెచ్చుకుంటూ హర్షధ్వానాలు పలికారు. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా బయోబబుల్‌ పరిస్థితులు ఉన్నా షాదాబ్‌ స్పందించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

మరిన్ని క్రీడా వార్త ల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Rahul Srivatshav: చెస్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు.. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్ శ్రీవాత్సవ్..

Major Movie: మేజర్‌ సినిమాపై బిగ్‌ బి ట్వీట్‌.. మహేశ్‌, శేష్‌ల రియాక్షన్‌ ఏంటంటే..

IND vs SA: అట్లుంటది మరి నాతోని.. ఉమ్రాన్‌ స్పీడ్‌కు విరిగిపోయిన పంత్‌ బ్యాట్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Follow Us
చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వీడియో చూశారా?
చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వీడియో చూశారా?
డబ్బు పోయినా పర్లేదు.. జీవితంలో ఈ కష్టాలు వస్తే మాత్రం భరించలేరట!
డబ్బు పోయినా పర్లేదు.. జీవితంలో ఈ కష్టాలు వస్తే మాత్రం భరించలేరట!
గంజి నీళ్లను పారబోస్తున్నారా?.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు!
గంజి నీళ్లను పారబోస్తున్నారా?.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు!
మీరు సిజేరియన్ మదరా?..బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!
మీరు సిజేరియన్ మదరా?..బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!
ఫోన్ వాడిన తర్వాత మహిళల్లో ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!
ఫోన్ వాడిన తర్వాత మహిళల్లో ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!
జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా Google
జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా Google
ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవడం ఎలా..?
ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవడం ఎలా..?
ఇన్‌స్టాగ్రామ్‌.. నేరాలకు కొత్త గేట్‌వే?
ఇన్‌స్టాగ్రామ్‌.. నేరాలకు కొత్త గేట్‌వే?
'వింక్' బ్యూటీకి వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్
'వింక్' బ్యూటీకి వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్
చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ..
చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ..