IPL Media Rights: నేటి నుంచే వేలం.. రిలయన్స్, స్టార్ మధ్య గట్టి పోటీ.. రూ. 45 నుంచి 50 వేల కోట్లు పొందనున్న బీసీసీఐ..

మొత్తం నాలుగు ప్యాకేజీల మొత్తం బేస్ ధర రూ. 32,890 కోట్లు. మొత్తం నాలుగు ప్యాకేజీల బేస్ ధరలను కలిపితే, 5 సంవత్సరాలలో ఆడాల్సిన 370 మ్యాచ్‌ల కలిపి బేస్ ధర రూ. 32,890 కోట్లు కానుంది.

IPL Media Rights: నేటి నుంచే వేలం.. రిలయన్స్, స్టార్ మధ్య గట్టి పోటీ.. రూ. 45 నుంచి 50 వేల కోట్లు పొందనున్న బీసీసీఐ..
Ipl 2022 Final
Follow us
Venkata Chari

|

Updated on: Jun 12, 2022 | 7:02 AM

IPL Media Rights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) తదుపరి ఐదు సీజన్‌ల (2023 నుంచి 2027 వరకు) మీడియా హక్కుల వేలం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ-వేలం ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తొలిసారిగా మీడియా హక్కులను వేలం వేయనున్నారు. భారత క్రికెట్ బోర్డు (BCCI) వేలం ముగియడానికి ఎటువంటి గడువును నిర్ణయించలేదు. అందువల్ల, విజేత కంపెనీని ప్రకటించడానికి ఒకటి కంటే ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది.

నాలుగు వేర్వేరు ప్యాకేజీలకు బిడ్డింగ్..

మొదటి ప్యాకేజీలో భారత ఉపఖండం నుంచి టీవీ హక్కులు ఉన్నాయి. అంటే, దీన్ని కొనుగోలు చేసిన కంపెనీ లీగ్‌ను భారత్‌తో సహా దక్షిణాసియా దేశాల్లో టీవీలో ప్రసారం చేస్తుంది. ఈ ప్యాకేజీలో బేస్ ధర రూ.49 కోట్లుగా నిలిచింది. రెండవ ప్యాకేజీ భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులకు సంబంధించినది. ఈ ప్యాకేజీని కొనుగోలు చేసిన సంస్థ దక్షిణాసియాలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో లీగ్‌ను ప్రసారం చేస్తుంది. ఇందులో ఒక మ్యాచ్ బేస్ ధర రూ.33 కోట్లుగా ఉంది. మూడవ ప్యాకేజీలో ఎంపిక చేసిన 18 మ్యాచ్‌ల డిజిటల్ హక్కులు ఉన్నాయి. వీటిలో సీజన్‌లోని మొదటి మ్యాచ్, సాయంత్రం మ్యాచ్, వారాంతంలో జరిగే ప్రతి డబుల్ హెడర్‌లో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక మ్యాచ్ బేస్ ధర రూ.11 కోట్లుగా ఉంది. నాల్గవ ప్యాకేజీలో భారత ఉపఖండం వెలుపల టీవీ, డిజిటల్ ప్రసార హక్కులు ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్ బేస్ ధర రూ.3 కోట్లుగా పేర్కొంది.

మొత్తం నాలుగు ప్యాకేజీల మొత్తం బేస్ ధర రూ. 32,890 కోట్లు. మొత్తం నాలుగు ప్యాకేజీల బేస్ ధరలను కలిపితే, 5 సంవత్సరాలలో ఆడాల్సిన 370 మ్యాచ్‌ల కలిపి బేస్ ధర రూ. 32,890 కోట్లు కానుంది. గతంలో (2018 నుంచి 2022) మీడియా హక్కులు రూ.16,347 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే ఈసారి మీడియా హక్కులను బేస్ ప్రైస్‌కే విక్రయిస్తే.. బీసీసీఐకి గతేడాదితో పోలిస్తే రెట్టింపు మొత్తం రావడం ఖాయంగా కనిపిస్తుంది. రూ. 45 నుంచి రూ. 50 వేల కోట్లు వస్తాయని బీసీసీఐ అంచనా వేసింది. రూ. 60 వేల కోట్లు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

మొదటి, రెండవ ప్యాకేజీల కోసం రిలయన్స్, స్టార్ మధ్య గట్టి పోటీ..

వేలంలో 8 కంపెనీలు పోటీపడుతున్నప్పటికీ, భారత ఉపఖండంలో, టీవీ, డిజిటల్ హక్కుల కోసం ముఖేష్ అంబానీ కంపెనీ వయాకామ్ 18, స్టార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సోనీ కూడా వేలంలోకి ప్రవేశిస్తోంది.

టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఆసియా, డ్రీమ్11 భారత ఉపఖండం (రెండో ప్యాకేజీ) డిజిటల్ హక్కుల కోసం మాత్రమే వేలం వేయగలవు.

స్కై స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ ఓవర్సీస్ మార్కెట్ హక్కులను (4వ ప్యాకేజీ) కొనుగోలు చేయడంపై దృష్టి సారించాయి.

ప్రతి ప్యాకేజీకి విడివిడిగా బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది..

2017లో టీవీ హక్కులు విక్రయించినప్పుడు, కంపెనీలు కాంపోజిట్ క్లెయిమ్‌ను సమర్పించే అవకాశం ఉంది. అంటే, కంపెనీలు టీవీ, డిజిటల్ కోసం ఏకకాలంలో వేలం వేయవచ్చు. ఇక డిజిటల్ రైట్స్ కోసం ఫేస్ బుక్ రూ.3900 కోట్లు ఆఫర్ చేసింది. స్టార్ డిజిటల్ కోసం తక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసింది. కానీ, హక్కులను పొందింది. ఎందుకంటే టీవీ, డిజిటల్ కోసం కాంపోజిట్ క్లెయిమ్ కింద స్టార్ అధిక మొత్తాన్ని ఆఫర్ చేసింది.

ఈసారి కాంపోజిట్ క్లెయిమ్‌ను సమర్పించడానికి ఎంపిక లేదు. ఒక కంపెనీ ఒకటి కంటే ఎక్కువ ప్యాకేజీలను పొందాలనుకుంటే, అది వేర్వేరు ప్యాకేజీల కోసం వేలం వేయాల్సి ఉంటుంది.

బిడ్డింగ్ ప్రక్రియ మొదటి, రెండవ ప్యాకేజీలతో ప్రారంభమవుతుంది. రెండు ప్యాకేజీల కోసం కంపెనీలు ఒక్కో మ్యాచ్‌కి వేలం వేయాలి. వాటి వేలం పూర్తయిన తర్వాత, మూడవ, నాల్గవ ప్యాకేజీలకు బిడ్డింగ్ జరుగుతుంది. మొదటి ప్యాకేజీని గెలుచుకున్న కంపెనీకి రెండవ ప్యాకేజీకి అత్యధిక బిడ్డర్‌ను సవాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, రెండవ ప్యాకేజీని గెలుచుకున్న కంపెనీ మూడవ ప్యాకేజీకి అత్యధిక బిడ్డర్‌ను సవాలు చేసే అవకాశం ఉంటుంది.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.