AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs AUS: విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు.. 200+ స్ట్రైక్ రేట్‌తో ఆసీస్ బౌలర్లను దంచికొట్టిన లంక సారథి..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, చివరి T20Iలో శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మొదటి 12 బంతుల్లో నెమ్మదిగా ఆడి, తర్వాత 13 బంతుల్లో గేర్ మార్చి వీరవిహారం చేశాడు. ఈ హవాలో ఆస్ట్రేలియా..

SL vs AUS: విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు.. 200+ స్ట్రైక్ రేట్‌తో ఆసీస్ బౌలర్లను దంచికొట్టిన లంక సారథి..
Sl Vs Aus Dsaun Shanaka
Venkata Chari
|

Updated on: Jun 12, 2022 | 7:40 AM

Share

శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ఆస్ట్రేలియా(SL vs AUS) చేసిన ప్లాన్స్ అంతగా పనిచేయలేదు. కారణం, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక(Dsaun Shanaka) రూపంలో వారికి అడ్డుపడ్డాడు. విజయం సాధించాలనే తపనతో బ్యాటింగ్ ఆకట్టుకుని, ఆస్ట్రేలియాను పడగొట్టాడు. ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో, చివరి T20Iలో శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మొదటి 12 బంతుల్లో నెమ్మదిగా ఆడి, తర్వాత 13 బంతుల్లో గేర్ మార్చి వీరవిహారం చేశాడు. ఈ హవాలో ఆస్ట్రేలియా విజయంపై ఆశలు కొట్టుకపోయాయి. శనక కేవలం 25 బంతుల్లోనే మ్యాచ్‌లో ఇంతటి తుఫాను సృష్టించాడు. ఫలితంగా ఆస్ట్రేలియాకు అనుకూలంగా 3-0తో సాగుతున్న టీ20 సిరీస్‌ తుది స్క్రిప్ట్‌ 2-1గా రాసేలా చేశాడు.

సిరీస్‌లోని మూడో, చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దసున్ శనక ధాటికి శ్రీలంక 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 1 బంతి మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాకు పరాజయాన్ని పరిచయం చేసిన శనక..

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో శనక.. 38 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. నాటౌట్‌గా నిలిచి కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 216 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక విజయానికి చివరి 3 ఓవర్లలో అంటే 18 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో శనక తొలి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, అకస్మాత్తుగా బ్యాటింగ్ గేర్ మార్చి, తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా తర్వాతి 13 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు బాది 48 పరుగులు పిండుకున్నాడు. దీంతో శనక 54 పరుగులు పూర్తి చేశాడు.

డెత్ ఓవర్లలో హాఫ్ సెంచరీ..

డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తూ శనక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో 2 పరుగులు రాబట్టాడు. 18వ ఓవర్‌లో 21 పరుగులు, 19వ ఓవర్‌లో 12 పరుగులు, 20వ ఓవర్‌లో 15 పరుగులు పిండుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా శనక నిలిచాడు.