IPL Media Rights Live Updates: మొదలైన ఐపీఎల్ మీడియా రైట్స్.. పోటీలో బడా కంపెనీలు.. రిలయన్స్, స్టార్ మధ్యే పోటీ..

IPL Media Rights Auction 2023-27 Live: చివరిసారి స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ హక్కులను కలిపి రూ. 16,347.50 కోట్లతో కొనుగోలు చేసింది.

IPL Media Rights Live Updates: మొదలైన ఐపీఎల్ మీడియా రైట్స్.. పోటీలో బడా కంపెనీలు.. రిలయన్స్, స్టార్ మధ్యే పోటీ..
IPL

|

Jun 12, 2022 | 1:08 PM

ఐపీఎల్ తదుపరి ఐదు సీజన్ల మీడియా హక్కులను నేడు వేలం వేయనున్నారు. ప్రస్తుతం, ఈ హక్కులు స్టార్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. Viacom18 JV (జెయింట్ వెంచర్), ప్రస్తుత హక్కుల హోల్డర్ వాల్ట్ డిస్నీ (స్టార్), Zee, Sony ఈ ప్యాకేజీకి నలుగురు పోటీదారులుగా ఉన్నారు. ఇవన్నీ టీవీ, డిజిటల్ హక్కుల రేసులో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున వయాకామ్18 టీవీ, డిజిటల్ హక్కుల కోసం బలమైన పోటీదారులలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇంతకుముందు అమెజాన్ పేరు కూడా రేసులోకి వచ్చినప్పటికీ.. కారణం చెప్పకుండానే రేసు నుంచి తప్పుకుంది. ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌ల కోసం రెండు రోజుల పాటు ఈ-వేలం నిర్వహిస్తారు. 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల పాటు వేలం నిర్వహిస్తారు. ఇందులో గత రెండేళ్లలో మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచవచ్చని భావిస్తున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 12 Jun 2022 11:59 AM (IST)

  ఫలితాాలు వచ్చేందుకు 48 గంటలు..

  ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేటగిరీ A, కేటగిరీ Bతో ఈ వేలం ప్రారంభమైంది. దేశంలో మ్యాచ్‌ల ప్రసార హక్కులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఇందులో ఉన్నాయి. వేలం ఫలితాలు రావడానికి 24 నుంచి 48 గంటల సమయం పట్టవచ్చు.

 • 12 Jun 2022 11:27 AM (IST)

  వేలం ప్రారంభం..

  బీసీసీఐ తొలిసారిగా ఈ-వేలం నిర్వహిస్తోంది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం నిర్వహణ బాధ్యతను ఎం-జంక్షన్ తీసుకుంది. ముంబైలో మీడియా హక్కుల వేలం కార్యక్రమాన్ని ఎం జంక్షన్ నిర్వహిస్తోంది.

 • 12 Jun 2022 11:05 AM (IST)

  మరికొద్ది సేపట్లో వేలం ప్రారంభం..

  ఐపీఎల్ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అన్నింటిలో మొదటగా A, B ప్యాకేజీల కోసం బిడ్లు వేయనున్నారు. ప్యాకేజీ Aలో టీవీ హక్కులు, ప్యాకేజీ Bలో ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులు ఉన్నాయి.

 • 12 Jun 2022 10:19 AM (IST)

  ఒక్కో ప్యాకేజీ ధర ఎలా ఉందంటే?

  నాలుగు ప్యాకేజీల ధరలు ఒక్కో మ్యాచ్‌కు భిన్నంగా ఉన్నాయి..

  ప్యాకేజీ A - ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు

  ప్యాకేజీ B - ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 కోట్లు

  ప్యాకేజీ C - ఒక్కో మ్యాచ్‌కు రూ.11 కోట్లు

  ప్యాకేజీ D - ఒక్కో మ్యాచ్‌కు రూ. 3 కోట్లు

 • 12 Jun 2022 10:03 AM (IST)

  ఐపీఎల్ మీడియా హక్కులను ఎలా వేలం వేయనున్నారు?

  ఐపీఎల్ మీడియా హక్కుల వేలం జూన్ 12, 13 తేదీల్లో జరగనుంది. మొదటి రోజు అంటే ఈరోజు టీవీ, మీడియా హక్కులను వేలం వేయనున్నారు. దీని కోసం, కంపెనీలు తమ మొత్తాన్ని బేస్ ధర కంటే ఎక్కువగా ఉంచాలి. అత్యధిక మొత్తంలో ఉన్న కంపెనీ, ఆ ప్యాకేజీపై హక్కును పొందుతుంది. కంపెనీలు ప్రతి ప్యాకేజీకి వేరు వేరుగా బిడ్లు దాఖలు చేయాలి.

 • 12 Jun 2022 09:02 AM (IST)

  ప్యాకేజీ A కోసం వేలం వేయని ZEE?

  ZEE టెక్నికల్ బిడ్‌లో పెట్టిందని, అయితే ప్యాకేజీ A కోసం వేలం వేయలేదని సమాచారం. వాస్తవానికి, దీని వెనుక కారణం సోనీతో విలీనం కావడమే. ఈ సందర్భంలో, ZEE బిడ్ చేస్తే, అది దాని స్వంత భాగస్వామి కంపెనీకి హాని కలిగించవచ్చు.

 • 12 Jun 2022 08:22 AM (IST)

  NFL రికార్డును IPL బ్రేక్ చేస్తుందా?

  అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా. ఈ లీగ్‌లో ఒక్కో మ్యాచ్ ధర రూ.133 కోట్లుగా పేర్కొన్నారు. దీని తర్వాత, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కో మ్యాచ్ ధర రూ. 81 కోట్లు. మేజర్ లీగ్ బేస్ బాల్ మూడవ స్థానంలో ఉంది. అదే సమయంలో, IPL ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇందులో ఒక్కో మ్యాచ్ ధర ప్రస్తుతం రూ. 54 కోట్లు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన లీగ్ విషయంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ని ఓడించి రెండో స్థానానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. BCCI ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ప్రకారం, IPL ఈసారి కొత్త రికార్డులను సృష్టించగలదని అన్నారు.

 • 12 Jun 2022 08:19 AM (IST)

  ఈ-వేలం 11 గంటల నుంచి ప్రారంభం..

  భారత క్రికెట్‌కు, బీసీసీఐకి ఈరోజు చాలా గొప్ప రోజు. ఈరోజు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా ప్యాకేజీ A, ప్యాకేజీ B కోసం వేలం జరుగుతుంది. దీని కోసం సోనీ నెట్‌వర్క్, డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్ 18 మధ్య పోరాటం కనిపిస్తుంది. ప్యాకేజీ A కోసం ZEE తన వేలంలో పాల్గొనవచ్చు. గూగుల్, అమెజాన్ ఇప్పటికే తమ పేర్లను ఉపసంహరించుకున్నాయి.

Published On - Jun 12,2022 8:10 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu