AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: మేజర్‌ సినిమాపై బిగ్‌ బి ట్వీట్‌.. మహేశ్‌, శేష్‌ల రియాక్షన్‌ ఏంటంటే..

Major Movie: 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్‌ (Major). యంగ్ హీరో అడివి శేశ్‌ (Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించాడు.

Major Movie: మేజర్‌ సినిమాపై బిగ్‌ బి ట్వీట్‌.. మహేశ్‌, శేష్‌ల రియాక్షన్‌ ఏంటంటే..
Major Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2022 | 6:40 PM

Share

Major Movie: 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్‌ (Major). యంగ్ హీరో అడివి శేశ్‌ (Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించాడు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై, మ‌హేష్‌బాబు (Mahesh Babu) ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూన్‌3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) స్పందించాడు. ‘మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా మేజర్‌ సినిమా తెరకెక్కింది. ఆయన ముంబై 26\11 దాడుల్లో ఎంతోమందిని రక్షించి అమరులయ్యారు. ఇప్పుడీ సినిమా ఇప్పుడు థియేటర్లలో రిలీజైంది. చిత్రబృందానికి నా బెస్ట్‌ విషెస్‌’ అంటూ హీరో అడివి శేశ్‌, మహేశ్‌బాబులను ట్యాగ్‌ చేశారు.

కాగా బాలీవుడ్‌ లెజెండ్‌ తమ సినిమాపై స్పందించడంతో హీరోలు మహేశ్‌, అడివిశేష్‌ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ‘మీ ఎంకరేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’ అని మహేశ్‌ రిప్లై ఇవ్వగా..’ఇది చాలా గొప్ప విషయం. లెజెండే స్వయంగా ట్వీట్‌ చేశారు’ అంటూ సమాధానమిచ్చాడు శేశ్‌. కాగా హిందీలోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విక్రమ్‌, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌లాంటి సినిమాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.10 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

LIC Share: లిస్టింగ్‌ నుంచి పడిపోతున్న ఎల్‌ఐసీ షేర్లు.. ఇంకా పడతాయా..?

Sai Pallavi: అప్పుడే నాకు పెళ్లైపోతుంది అనుకున్నాను.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..

Actress Ramya: అసభ్యకర కామెంట్స్ చేసిన నెటిజన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్