AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Share: లిస్టింగ్‌ నుంచి పడిపోతున్న ఎల్‌ఐసీ షేర్లు.. ఇంకా పడతాయా..?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లలో క్షీణత కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ వారం ఈ స్టాక్ రూ.710 స్థాయిలో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో ఇది రూ. 708 స్థాయికి పడిపోయింది...

LIC Share: లిస్టింగ్‌ నుంచి పడిపోతున్న ఎల్‌ఐసీ షేర్లు.. ఇంకా పడతాయా..?
LIC
Srinivas Chekkilla
|

Updated on: Jun 11, 2022 | 3:06 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లలో క్షీణత కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ వారం ఈ స్టాక్ రూ.710 స్థాయిలో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో ఇది రూ. 708 స్థాయికి పడిపోయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. రూ.949 దాని 52 వారాల గరిష్టం. ఇది దాని ఇష్యూ ధర కూడా. ఇష్యూ ధరతో పోలిస్తే ఈ స్టాక్ ఇప్పటివరకు దాదాపు 25 శాతం పడిపోయింది. LIC మార్కెట్ క్యాప్ ఈ కాలంలో అది దాదాపు రూ. 1.5 లక్షల కోట్లకు తగ్గింది. లిస్టింగ్ రోజున దీని మార్కెట్ క్యాప్ 6 లక్షల కోట్లు దాటింది. అది ఇప్పుడు రూ.4.48 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ల పతనం కొనసాగడం వల్ల ప్రభుత్వం కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపింది. అయితే ఈ క్షీణతను తాత్కాలికంగా పేర్కొంది. బీమా కంపెనీ యాజమాన్యం ఈ అంశాలను పరిశీలించి వాటాదారుల విలువను పెంచుతుందని ప్రభుత్వం తెలిపింది.

లిస్టింగ్ నుంచి LIC షేర్లు ఇష్యూ ధర కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ కాలంలో ఒక్కో షేరుపై కనిష్టంగా రూ.708.70కి పడిపోయింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే మాట్లాడుతూ ఎల్‌ఐసీ షేరు ధర పతనంపై ఆందోళన చెందుతున్నామని, ఈ క్షీణత తాత్కాలికమే. ఎల్‌ఐసి నిర్వహణ ఈ అంశాలన్నింటినీ చూసుకుంటుందిని, వాటాదారులకు విలువను జోడిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ స్టాక్ మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ జూన్ 13తో ముగియనుంది. అటువంటి పరిస్థితిలో వారు కూడా పెద్ద ఎత్తున విక్రయించవచ్చు. దీని కారణంగా షేర్లు మరింత పడిపోతాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు నెల రోజుల లాక్-ఇన్ వ్యవధి ముగియవచ్చని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం, SBI మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లు లైఫ్ ఇన్సూరెన్స్ IPOలో పెట్టుబడి పెట్టాయి. దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు దీనిని విస్తృతంగా కొనుగోలు చేశాయి. ఈ IPOలో 99 పథకాలు రూ.4000 కోట్లు పెట్టుబడి పెట్టాయి.