Viral video: ఒకే చోట 31 వేల కిలోల అరటి పండ్లు పారబోశారు.. ఈ బనానా బొనాంజా వెనక ఉన్న అసలు సంగతేంటంటే..
Viral video: సాధారణంగా మనం అరటి గెలలు చూసి ఉంటాం. అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ లేదా వెజిటేబుల్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అరటి పండ్ల లోడ్లు చూసి ఉంటాం. అయితే అమెరికాలోని ఓ చోట..
Viral video: సాధారణంగా మనం అరటి గెలలు చూసి ఉంటాం. అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ లేదా వెజిటేబుల్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అరటి పండ్ల లోడ్లు చూసి ఉంటాం. అయితే అమెరికాలోని ఓ చోట ఏకంగా 31వేల కిలోల అరటి పండ్లను ధాన్యంలా పోశారు. ఓ సూపర్ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ పండ్ల రాశిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కేందుకు స్థానిక సూపర్ మార్కెట్ నిర్వాహకులే ఇలా భారీగా అరటి పండ్లను ప్రదర్శనకు ఉంచారట. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చికాగోలోని ప్రముఖ పండ్ల సరఫరా కంపెనీ ఫ్రెష్ డెల్ మోంటే..జువెల్ ఓస్కో అనే స్టోర్‌తో కలిసి ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసింది.యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని వెస్ట్‌మాంట్‌లోని ఓ సూపర్ మార్కెట్ ఆవరణలో 70,000 పౌండ్ల (సుమారు 31,751 కిలోలు) అరటి పండ్లను కుప్పలుగా పోశారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ నిర్వాహకులు వాటిని లెక్కించి ధ్రువీకరించారు.
కాగా గతంలో ఈ రికార్డు ఇంతకుముందు బ్రెజిల్‌కు చెందిన కాన్పెడరకో డి అగ్రికల్చరల్ ఈ పెక్యురియా కంపెనీ పేరుపై ఉంది. 2016లో బ్రెజిల్‌లోని ఒక ప్రదేశంలో 41,459.78 పౌండ్ల (18,805 కిలోలు) పండ్లను సేకరించి కుప్పులుగా పోసి గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించి. ఇందులో ఏకంగా 19 రకాల పండ్లను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ ఈ పండ్లను పంపిణీ చేశారు. తాజాగా ఈ రికార్డును ఫ్రెష్ డెల్ మోంటే బద్దలు కొట్టింది. కాగా ఈ 31 వేల కిలోల అరటి పండ్లను చక్కగా అమర్చేందుకు మూడు రోజులు పట్టిందట. ప్రదర్శన అనంతరం కొన్ని పండ్లను స్థానికులకు పంచగా.. మరికొన్నింటినీ ఫుడ్ బ్యాంకుకు విరాళంగా అందించారట.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Pranitha Subhash: పండంటి బిడ్డను ప్రసవించిన బాపు బొమ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోస్..