Ranji Trophy 2022: రంజీ ట్రోఫీలో అదరగొట్టిన క్రీడా మంత్రి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు..
Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ- 2022లో బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి (Manoj Tiwary) అదరగొడుతున్నాడు. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు జార్ఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు
Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ- 2022లో బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి (Manoj Tiwary) అదరగొడుతున్నాడు. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు జార్ఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. ఇదే మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ అతను అర్ధసెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్‌లు తలపడనున్నాయి. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ప్రస్తుతం బెంగాల్ క్రీడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మనోజ్. పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో అతను విజయం సాధించాడు. కాగా క్రికెట్‌పై ఆసక్తితో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నా.. ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
రాజకీయాల్లో బిజీగా..
ఈక్రమంలో రంజీట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మొదటి క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు . రెండో ఇన్నింగ్స్ లో 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను తివారి తన సూపర్బ్ ఇన్నింగ్స్‌తో చక్కదిద్దాడు. మొత్తం152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీని అందుకున్నాడు. ఓవరాల్‌గా 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేసి తనలో పస తగ్గలేదని నిరూపించుకున్నాడు. కాగా మనోజ్ సెంచరీతో ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు అంపైర్లు. కాగా టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 119 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, 51.78 సగటుతో మొత్తం 8, 752 రన్స్ చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిసారిగా ఐపీఎల్ 2018 సీజన్‌లో బరిలోకి దిగాడు. ఆతర్వాత రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.
Congratulations to @tiwarymanoj for getting his 28th 1st class 100 in the 2nd inn of #RanjiTrophy quarter final against #Jharkhand. He also scored 73 runs in the 1st inn where 9 #Bengal players went on to score 50+ score & setting up a new world record in 1st class cricket.#CAB pic.twitter.com/PsuXBSOX1q
— CABCricket (@CabCricket) June 10, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
IND vs SA: అప్పుడు విరాట్.. ఇప్పుడు పంత్.. సేమ్ టు సేమ్ ఐదేళ్ల నాటి చరిత్ర రిపీట్..