IND vs SA: అట్లుంటది మరి నాతోని.. ఉమ్రాన్ స్పీడ్‌కు విరిగిపోయిన పంత్ బ్యాట్.. నెట్టింట్లో వైరల్ వీడియో..
IND vs SA T20 Series: ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా వినిపిస్తోన్న పేరు. భీకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్- 2022 సీజన్‌తో తెర మీదకు వచ్చాడు.
IND vs SA T20 Series: ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా వినిపిస్తోన్న పేరు. భీకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్- 2022 సీజన్‌తో తెర మీదకు వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగి గంటకు150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్ల వెన్నులో వణుకుపుట్టించాడు. సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 22 వికెట్లు తీసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల ఈ20 సిరీస్ కోసం ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో ఈ జమ్మూ కుర్రాడికి అవకాశం రాలేదు. రేపు కటక్ వేదికగా జరిగే టీ20 మ్యాచ్‌లో అతను అరంగేట్రం చేయవచ్చని తెలుస్తోంది.
తొలి టీ 20 మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్‌లోనైనా గెలవాలని భావిస్తోంది. ఈక్రమంలో రిషభ్ పంత్ నాయకత్వంలోని జట్టు నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. తాత్కాలిక కెప్టెన్ పంత్ కూడా నెట్స్ లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా ఉమ్రాన్ వేగంగా వేసిరిన ఓ బంతి పంత్ బ్యాట్ ను విరగొట్టింది. దీంతో పంత్ చాలాసేపు బ్యాట్‌ను చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. కాగా ప్రాక్టీసు సెషన్‌లో భాగంగా గంటకు సుమారు 160కి పైగా వేగంతో బంతులు విసిరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పంత్ బ్యాట్ విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Major Movie: మేజర్ సినిమాపై బిగ్ బి ట్వీట్.. మహేశ్, శేష్‌ల రియాక్షన్ ఏంటంటే..
Brahmastra: బ్రహ్మస్త్ర నుంచి నాగర్జున పోస్టర్ వచ్చేసింది.. పవర్ఫుల్ లుక్‌లో కింగ్..
TV9 Telugu: తెలుగు మీడియాలో టీవీ9 సంచలనం.. 19 అవార్డులు కైవసం