Brain teaser: మీరు బాగా షార్పా.. అయితే ఈ ఫోటోలో ఏ గ్లాసు ఫస్ట్ నిండుతుందో 30 సెకన్లలో చెప్పండి..?

Viral Photo: గజిబిజి పజిల్.. చాలా చిత్రమైనది.. మీరు బాగా క్లవర్ అయితే ఇందులో ఏ గ్లాసు ఫస్ట్ నిండుతుందో సెకన్ల వ్యవధిలో కనిపెట్టండి.

Brain teaser: మీరు బాగా షార్పా.. అయితే ఈ ఫోటోలో ఏ గ్లాసు ఫస్ట్ నిండుతుందో 30 సెకన్లలో చెప్పండి..?
Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 11, 2022 | 8:00 PM

Puzzle: ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) ఏ రేంజ్‌లో డెవలప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయస్సుతో పనిలేదు. అందరికి ఇప్పుడు ఇన్‌స్టా, ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter) ఖాతాలు ఉన్నాయి. ఇంకాస్త అప్‌డేటెడ్ స్నాప్ చాట్, వి చాట్ వంటి వాటిని కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అయితే  ఈ మధ్య సోషల్ మీడియాలో  మెద‌డుకు మేత లాంటి ప‌జిల్స్‌, ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్స్, బ్రెయిన్ టీజర్స్ వైర‌ల్ అవుతుంటాయి. పజిల్స్ ద్వారా మీ బుర్ర ఎంత యాక్టివ్‌గా వర్క్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఫోటో పజిల్స్ ద్వారా మీ ఐ పవర్ ఏ లెవల్‌లో ఉందో టెస్ట్ చేసుకోవచ్చు. ఇక బ్రెయిన్ టీజర్స్ ద్వారా మీరు ఎంత ఇస్మార్ట్‌గా ఆలోచిస్తారో ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఓ బ్రెయిన్ టీజర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పైన ఫోటోలో ఏ గ్లాస్ ముందు నిండుతుందో మీరు 30 సెకన్ల లోపల చెప్పగలిగితే.. మీరు చాలా యాక్టివ్ పర్సన్ అని చెప్పవచ్చు. ఐక్యూ ఎక్కువ‌గా ఉన్న‌వాళ్లు, మెద‌డుకు ప‌దును పెట్టేవాళ్లు ఈజీగా ఈ బ్రెయిన్ టీజర్ సాల్వ్ చేస్తున్నారు. మరొక్కసారి ఫోటోను దిగువన పరీక్షగా చూడండి.

Brain Teaser

ఏ గాజు మొదట నిండుతుందో మీరు గుర్తించారా?

లేదా?

క్లూ కావాలా?

గ్లాసులను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసే పైపులను జాగ్రత్తగా చూడండి. వాటిలో కొన్ని బ్లాక్ చేసి ఉన్నాయి.

ఏంటి ఇంకా కనుక్కోలేకపోయా…?

ఇక మేమే చెప్పేస్తాం… 3 వ నెంబర్ గాజు గ్లాసు మొదట నిండుతుంది. గ్లాస్ 1 నుండి గ్లాస్ 3లోకి నీరు పోయడం స్టార్ అవుతుంది.  అయితే గ్లాసు6, గ్లాసు 7 కనెక్టర్‌లు బ్లాక్ చేయడం వల్ల.. వాటిల్లోకి నీరు వెళ్లదు. దీంతో 3 వ గ్లాసు త్వరితగతిన నిండుతుంది.

 

Puzzle Solution