Virata Parvam: విరాటపర్వం నుంచి మరో బిగ్‌ అప్డేట్‌.. రానా పాడిన పాట రిలీజ్‌ ఎప్పుడంటే..

Virata Parvam: దగ్గుబాటి రానా (Daggubati Rana), సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట‌ప‌ర్వం. నీది నాది ఒకే క‌థ సినిమాతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కించారు.

Virata Parvam: విరాటపర్వం నుంచి మరో బిగ్‌ అప్డేట్‌.. రానా పాడిన పాట రిలీజ్‌ ఎప్పుడంటే..
Virata Parvam
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2022 | 9:35 PM

Virata Parvam: దగ్గుబాటి రానా (Daggubati Rana), సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట‌ప‌ర్వం. నీది నాది ఒకే క‌థ సినిమాతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వరా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్టకేలకు ఇటీవల విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. నక్సలిజానికి ప్రేమకథను జోడించి రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. వరుస అప్డేట్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈక్రమంలో తాజాగా మ‌రో బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు మూవీ మేకర్స్‌.

ఈ చిత్రంలోని ఛ‌లో ఛలో అంటూ సాగే వారియ‌ర్ సాంగ్‌ను ఆదివారం (జూన్‌12) విడుద‌ల చేయ‌బోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను స్వయంగా రానా ఆలపించడం విశేషం. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక సినీ పరిశ్రమలోని ప్రముఖులకు వరుసగా ప్రీమియర్‌ షోలు వేస్తున్నారు విరాట పర్వం మూవీ మేకర్స్‌. యంగ్‌ హీరోలు నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ వంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి సూపర్బ్‌గా ఉన్నారని కితాబిచ్చారు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌, నవీన్‌ చంద్ర, ఈశ్వరీ రావు, నివేద పేతురాజ్‌, సాయిచంద్‌ వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Nayanthara: భర్తకు కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన నయన్.. కళ్లు చెదిరే కానుకలు ఇచ్చుకున్న క్యూట్ కపుల్..

Jammu And Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు..

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలెర్ట్.. ఆదివారం పలు మార్గాల్లో రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..