Pakka Commercial: పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎక్కడంటే ?..
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్

మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్ (Pakka Commercial). ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జులై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్ అప్‌డేట్ తెలిపారు దర్శక నిర్మాతలు.
జూన్ 12 సాయంత్రం 5 గంటలకు మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్ లలితకళా థియేటర్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గ్లింప్స్ ఆసక్తి పెంచేసింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.




Witness the Pakka Entertaining Trailer Launch Event of #PakkaCommercial on 12th June @ 5PM!
?Asian Laxmikala Shashikala Cinepride(Lalitha Screen), HYD#AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @GA2Official @UV_Creations @shreyasgroup pic.twitter.com/l72Qu2KDAb
— UV Creations (@UV_Creations) June 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.