Virata Parvam: విరాటపర్వంలో అజ్ఞాతపోరాటం ఉంది.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటన అద్భుతం.. రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించగా.. ప్రియమణి, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు.

Virata Parvam: విరాటపర్వంలో అజ్ఞాతపోరాటం ఉంది.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటన అద్భుతం.. రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rana
Follow us

|

Updated on: Jun 12, 2022 | 6:44 AM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం విరాట పర్వం (Virata Parvam). ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించగా.. ప్రియమణి, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన రానా.. విరాటపర్వం మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రానా మాట్లాడుతూ.. ” గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.,నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు, ఎంత త్యాగం చేస్తాడు ? స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా డీప్ గా అనిపించింది. కథ చదివినప్పుడు చాలా బరువనిపించింది. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో విరాటపర్వం కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. విరాటపర్వం లాంటి కథ ఎప్పుడూ వినలేదు, అంత భారం ఎప్పుడు తీసుకోలేదు. రవన్న కానీ దళం సభ్యులు కానీ మరో ఉద్యమ నాయకులు కానీ ఖచ్చితమైన లక్ష్యంతో వుంటారు. కుటుంబ, స్నేహ సంబంధాలు కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా ? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా.ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది అని అన్నారు.

విరాటపర్వం టైటిల్ జస్టిఫీకేషన్ ఏంటి ? అని అడగ్గా.. “మహా భారతంలో విరాటపర్వం అనేది అజ్ఞాతవాసానికి సంబంధించిన కథ. విరాట పర్వంలో కూడా ఇలాంటి అజ్ఞాతపోరాటం వుంటుంది. సాయి పల్లవి గొప్ప నటి. విరాట పర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్ లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. సాయి పల్లవి చాలా సింపుల్ పర్శన్. ఆ సింప్లీసిటీ వల్లే ఇంత అద్భుతమైన నటన కనుబరుస్తుందని భావిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు