Prathyusha Garimella Death: ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌.. ఉన్నతంగా ఆలోచించే నువ్వు..

Upasana Konidela: హైద‌రాబాద్‌లో ప్రముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్రత్యూష గ‌రిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్లందరికీ ఈమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.

Prathyusha Garimella Death: ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌.. ఉన్నతంగా ఆలోచించే నువ్వు..
Prathyusha Garimella
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2022 | 10:11 PM

Upasana Konidela: హైద‌రాబాద్‌లో ప్రముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్రత్యూష గ‌రిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్లందరికీ ఈమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. రానా లాంటి చాలా మంది హీరోలకు కూడా ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో కలిసున్న మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలో ప్రత్యూష మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) పేర్కొంది. ఈ సందర్భంగా ఆమెతో కలిసున్న ఫొటోను పంచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

‘ప్రత్యూష నా డియరెస్ట్‌ ఫ్రెండ్‌. చాలా త్వరగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగ ఆలోచించేది. కెరీర్ ప‌రంగా, కుటుంబం, స్నేహితుల ప‌రంగానూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేది. అన్ని విష‌యాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెష‌న్‌కు గురి కావడం బాధ క‌లిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ ట్విట్టర్‌ వేదికగా ఆకాంక్షించింది ఉపాసన. కాగా ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులకు ప్రత్యూష కస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌ చేశారు. జాక్వెలిన్, మాధురి దీక్షిత్, దీపికా పదుకోన్‌, పరిణీతి చోప్రా, విద్యాబాలన్‌, శృతి హాసన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రణీత, ఛార్మి, రామ్‌చరణ్‌, ఉపాసన వంటి ప్రముఖ సినీతారలు, ప్రముఖులకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారు. అనేక మంది సెలబ్రిటీలు ప్రత్యూష వర్క్స్‌ను ఎండార్స్ చేశారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఆల్‌ మోస్ట్‌ హీరోయిన్లందరికీ ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. బాలీవుడ్‌ తారలు అనేక మంది ప్రత్యూషకు ఫ్యాన్స్‌గా ఉన్నారు. కొంత మంది హీరోలకు కూడా ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Virata Parvam: విరాటపర్వం నుంచి మరో బిగ్‌ అప్డేట్‌.. రానా పాడిన పాట రిలీజ్‌ ఎప్పుడంటే..

Nayanthara: భర్తకు కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన నయన్.. కళ్లు చెదిరే కానుకలు ఇచ్చుకున్న క్యూట్ కపుల్..

Jammu And Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు..