IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ 20 మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బవుమా.. టీమిండియా ప్లేయింగ్‌- XI ఎలా ఉందంటే..

India vs South Africa 2nd T20: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant) నేతృత్వంలోని భారత జట్టు..

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ 20 మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బవుమా.. టీమిండియా ప్లేయింగ్‌- XI ఎలా ఉందంటే..
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2022 | 9:15 PM

India vs South Africa 2nd T20: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant) నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. కాగా మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి పేలవమైన బౌలింగే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈక్రమంలో మొదటి మ్యాచ్‌లో జరిగిన తప్పులు మరోసారి పునరావృతం కాకూడదని, ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పంత్ సేన భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. వికెట్ ఎలా ఉందో మాకు అర్థం కావడం లేదు. గత మ్యాచ్‌లో రెండో సారి బ్యాటింగ్ చేయడం మాకు సులువైంది. చిన్న మైదానంలో ఎంత పెద్ద స్కోరునైనా ఛేజ్ చేయవచ్చు’ అని బవుమా చెప్పుకొచ్చాడు.

మార్పుల్లేకుండానే..

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్‌ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు టీమిండియా. అయితే దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. క్వింటన్ డి కాక్ గాయం కారణంగా దూరం కాగా, స్టబ్స్‌కు కూడా అవకాశం రాలేదు. హెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రిక్స్‌లకు తుది జట్టులో అవకాశం దక్కించుకున్నారు.

ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉన్నాయంటే..

భారత్

రిషబ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్ ), ఇషాన్ కిషన్,  రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ , అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా

టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికె), రాసి వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబరిజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిక్ నోర్కియా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Maoists Surrender: ఏవోబీలో మావోలకు భారీ ఎదురుదెబ్బ.. 180 మంది సానుభూతిపరుగుల లొంగుబాటు.. పోలీసుల ఎదుటే యూనిఫాం దగ్ధం..

CM KCR: ఉండవల్లితో సమావేశమైన గులాబీ బాస్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సరికొత్త చర్చకు దారి తీసిన భేటీ..

Viral Video: ఈ ఎలుగుబంటికి ట్రాఫిక్‌ సెన్స్‌ ఎక్కువే.. రోడ్డుపై ట్రాఫిక్‌ కోన్‌ను ఎలా సరి చేసిందో మీరే చూడండి..