Maoists Surrender: ఏవోబీలో మావోలకు భారీ ఎదురుదెబ్బ.. 180 మంది సానుభూతిపరుగుల లొంగుబాటు.. పోలీసుల ఎదుటే యూనిఫాం దగ్ధం..

ధాకడ్‌పదర్, డాబుగూడ, అర్లింగ్‌పడ.. ఏవోబీ మల్కాన్‌గిరి జిల్లాలోని గ్రామాలు. ఇవి జోడంబో పోలీస్‌ స్టేష‌న్‌ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులంతా ఈ మూడు గ్రామాలకు చెందినవాళ్లే.

Maoists Surrender: ఏవోబీలో మావోలకు భారీ ఎదురుదెబ్బ.. 180 మంది సానుభూతిపరుగుల లొంగుబాటు.. పోలీసుల ఎదుటే యూనిఫాం దగ్ధం..
Maoists Surrender
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:46 PM

ధాకడ్‌పదర్, డాబుగూడ, అర్లింగ్‌పడ.. ఏవోబీ మల్కాన్‌గిరి జిల్లాలోని గ్రామాలు. ఇవి జోడంబో పోలీస్‌ స్టేష‌న్‌ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులంతా ఈ మూడు గ్రామాలకు చెందినవాళ్లే. BSF క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద వారు సరెండర్ అయ్యారు. గతంలో జరిగిన ఎదురుకాల్పులు, హత్యల్లో ఈ మిలీషియా సభ్యుల ప్రమేయం ఉంది. ఇక మీదట అలాంటి అనాలోచిత పనులు చెయ్యబోమని పోలీసులకు మాటిచ్చి ప్రతిజ్ఞ చేశారు. ఏవోబీ మల్కాన్‌గిరి జిల్లాలో కొన్నిరోజులుగా యాంటీ మావో ఆపరేషన్‌ జోరుగా సాగుతోంది. BSF బలగాలు ఈ జిల్లాకు వచ్చాక మల్కాన్‌గిరి జిల్లా రూపురేఖలే మారిపోయాయట. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటగా వున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు BSF బలగాలు పాగా వేశాయి. గ్రామస్థులతో మమేకమై… మావో సానుభూతిపరుల్ని తమవైపు తిప్పుకుంటున్నాయి. ఇప్పుడు లొంగిపోయిన వాళ్లు… ఇకపై మావోల ఊసే ఎత్తబోమని హామీ ఇస్తూ తమ యూనిఫామ్స్‌ని కూడా పోలీసుల ఎదుటే తగలబెట్టేశారు.

మావోయిస్టుల కంటే పోలీసుల వల్లే తమ గ్రామాలకు మేలు జరిగిందన్నది సానుభూతిపరుల మాట. కొన్ని నెలల్లోనే ఈ మార్పును చూడగలిగామని, ఖాకీల వల్లే తమ జీవితాలు బాగుపడతాయని తెలుసుకున్నామని చెబుతున్నారు. జూన్ 2న DG సునీల్ బన్సాల్ స్వాభిమాన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పుడు 50 మంది మావోయిస్టు సానుభూతిప‌రులు లొంగిపోయారు. ఇప్పుడు అదే పంచాయ‌తీలో ఏకంగా 180 మంది సానుభూతిప‌రులు సరెండరయ్యారు. ఇకపై తప్పుడు వాగ్దానాలను నమ్మేది లేదని, జనజీవన స్రవంతిలో కలుస్తామని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్నే నమ్ముతామని ప్రతిజ్ఞ చేశారు. ఏవోబీలో BSF బలగాలకు ఇదొక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

CM KCR: ఉండవల్లితో సమావేశమైన గులాబీ బాస్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సరికొత్త చర్చకు దారి తీసిన భేటీ..

The Warrior: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ నయా మూవీ.. భారీ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ది వారియర్ టీజర్

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ 20 మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బవుమా.. టీమిండియా ప్లేయింగ్‌- XI ఎలా ఉందంటే..