AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ట్రైన్ బోగీని క్లీన్ చేసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు.. లోపల దృశ్యం చూసి భయంతో పరుగులు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు అందరూ దిగిన తర్వాత ఓ ట్రైన్ బోగీని శుభ్రం చేయటానికి వెళ్లిన పారిశుద్ధ కార్మికులు ఒక్కసారిగా భయంతో పరుగుతు తీశారు. ఎందుకంటే..?

Tirupati: ట్రైన్ బోగీని క్లీన్ చేసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు.. లోపల దృశ్యం చూసి భయంతో పరుగులు
Tirupati Railway Station
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2022 | 7:42 PM

Share

AP News: తిరుపతి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఆగి ఉన్న ట్రైన్‌లోని ఓ బోగీని క్లీన్ చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లారు. లోపల కనిపించిన దృశ్యం చూసి వారు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. వారు అంతలా టెన్షన్ పడింది ఎందుకంటే అక్కడ కనిపించింది డెడ్‌బాడీ. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం శ్రీకాకుళం(Srikakulam) నుండి తిరుపతికి చేరిన ట్రైన్‌లోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. పాసింజర్స్ అందరూ దిగిన తర్వాత బోగీని శుభ్రం చేయటానికి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు డెడ్‌బాడీని గుర్తించి స్టేషన్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తిరుపతి స్టేషన్ అధికారుల కంప్లైంట్‌తో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి(Ruia Hospital)కి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో విచారిస్తున్నారు. అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడా.. లేక గుండెపోటుతోనా.. లేక ఎవరైనా చంపేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఆ డెత్ మిస్టరీ వీడనుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!