AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: అడివిశేష్‌ సినిమాను చూసిన మేజర్‌ సందీప్‌ సహోద్యోగి.. నిజమైన శాండీ సార్‌ను చూశానంటూ..

26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం మేజర్ (Major). యంగ్ హీరో అడివి శేష్‌(Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించి మెప్పించాడు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా,

Major Movie: అడివిశేష్‌ సినిమాను చూసిన మేజర్‌ సందీప్‌ సహోద్యోగి.. నిజమైన శాండీ సార్‌ను చూశానంటూ..
Major Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2022 | 6:38 PM

Share

26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం మేజర్ (Major). యంగ్ హీరో అడివి శేష్‌(Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించి మెప్పించాడు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై, మ‌హేష్‌బాబు (Mahesh Babu) ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూన్ 3న తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో చాలామంది ఈ సినిమాను చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్‌ దగ్గర మేజర్‌ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలోనే 50 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌తో కలిసి పని చేసిన రజాక్ ఆదిల్ అనే సహోద్యోగి మేజర్‌ చిత్రంపై స్పందించారు.

‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మొదట సినిమాలో శాండీ సర్‌గా నటించిన అడివి శేష్ నుంచి నాకు ఫోన్‌ కాల్ వచ్చింది. ఈ సినిమా పట్టాలెక్కడానికి మొదటి కారణం ఆయనే. అలాగే సందీప్ తండ్రికి కూడా ధన్యవాదాలు. శాండీని గుర్తు చేసుకున్న ప్రతిసారీ ఓ కొత్తరకమైన అనుభూతి చెందుతున్నాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల స్పందనను చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ మూవీలో చూపించిన దానిలో చాలా వరకు వాస్తవం ఉంది. నాకు ఎంతో సన్నిహితమైన సందీప్ కుటుంబం, వారి త్యాగం గురించి చాలా బాగా చూపించారు. మేజర్‌కి, ఆయన సతీమణికి మధ్య ప్రేమకథను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. ఇందుకు గాను అడివి శేష్‌కి ఎన్నో ప్రశంసలు అందుకోవాలి. అతను నటించిన విధానం మా హృదయాలను మెలిపెట్టింది. చాలా రోజుల తర్వాత నిజమైన శాండీని చూసిన భావన కలిగింది. ఈ చిత్రనిర్మాతలు శాండీ జీవితంలో జరిగిన కీలక అంశాలను హైలైట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు’ అని రజాక్‌ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఎమోషనల్‌ నోట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది మేజర్‌ చిత్రబృందం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

AR Rahman: గ్రాండ్‌గా ఏఆర్‌ రెహమాన్‌ తనయ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. సందడి చేసిన సెలబ్రిటీలు.. వైరలవుతోన్న ఫొటోలు..

Cooper Noriega: టిక్‌టాక్‌ సెన్సేషన్‌ అనుమానాస్పద మృతి.. షాపింగ్‌మాల్‌లో దొరికిన శవం.. ఆ వీడియో షేర్‌ చేసిన కొద్ది సేపటికే..

Nikhat Zareen: బాక్సింగ్‌లో మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకున్న నిఖత్‌ జరీన్‌..