Cooper Noriega: టిక్‌టాక్‌ సెన్సేషన్‌ అనుమానాస్పద మృతి.. షాపింగ్‌మాల్‌లో దొరికిన శవం.. ఆ వీడియో షేర్‌ చేసిన కొద్ది సేపటికే..

Cooper Noriega Death: అమెరికన్ టిక్‌టాక్‌ సెన్సేషన్‌ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జూన్ 9న లాస్ ఏంజిల్స్ లోని ఓ మాల్ పార్కింగ్ లాట్ లో అతను శవమై కనిపించాడు. అయితే కూపర్‌ మృతి చెందడానికి కొన్ని గంటల ముందే..

Cooper Noriega: టిక్‌టాక్‌ సెన్సేషన్‌ అనుమానాస్పద మృతి.. షాపింగ్‌మాల్‌లో దొరికిన శవం.. ఆ వీడియో షేర్‌ చేసిన కొద్ది సేపటికే..
Cooper Noriega
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2022 | 4:58 PM

Cooper Noriega Death: అమెరికన్ టిక్‌టాక్‌ సెన్సేషన్‌ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జూన్ 9న లాస్ ఏంజిల్స్ లోని ఓ మాల్ పార్కింగ్ లాట్ లో అతను శవమై కనిపించాడు. అయితే కూపర్‌ మృతి చెందడానికి కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో బెడ్ పై సేద తీరుతూ కనిపించిన అతను యంగ్‌ ఏజ్‌లోనే చనిపోతామోనని ఎవరు ఆలోచిస్తున్నారు..? అని తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్లను ప్రశ్నించాడు. ఈ వీడియో షేర్‌ చేసిన కొద్దిగంటల్లోనే అతను ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కాగా దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

డిప్రెషన్‌తోనే చనిపోయాడా?

ఇవి కూడా చదవండి

కాగా కొంతకాలంగా కూపర్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టిక్‌టాక్‌లో అతను పోస్ట్‌ చేస్తోన్న వీడియోల్లో చాలావరకు మెంటల్‌ హెల్త్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ‘మీ కష్టాలను నాతో షేర్‌ చేసుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు.. మీకు నేను తోడున్నాను’ అంటూ ఇటీవల ఓ వీడియో షేర్‌ చేసుకోవడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది. కాగా కూపర్ కి టిక్‌టాక్‌లో 1.77 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యం ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలతో పాటు ఫ్యాషన్ వీడియోలను టిక్‌టాక్‌లో షేర్‌ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తున్నాడు.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Nikhat Zareen: బాక్సింగ్‌లో మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకున్న నిఖత్‌ జరీన్‌..

Actress Sukrithi: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కేరింత నటి.. నెట్టింట్లో వైరలవుతోన్న నిశ్చితార్థం ఫొటోలు..