AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో అడివి శేశ్‌ (Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించాడు.

Pawan Kalyan : మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Mahesh Babu, Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Jun 12, 2022 | 5:13 PM

Share

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో అడివి శేశ్‌ (Adivi Sesh) మేజర్‌ పాత్రలో నటించాడు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై, మ‌హేష్‌బాబు (Mahesh Babu) ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూన్ 3న రిలీజ్ అయిన మేజర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాపై సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేజర్ మూవీ పై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు ఓ లెటర్ ను రిలీజ్ చేశారు.

“ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు.. ఆయన వీర మరణాన్ని వెండి తెరపై `మేజర్ ` గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన తెలుసుకొని ఎంతో సంతోషించాను. అన్ని భాషల వారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు.. సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో `మేజర్` ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను.

ఇవి కూడా చదవండి

త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను. ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ.. వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను` అని ఓ లేఖ రిలీజ్ చేశారు పవన్. దీనిపై హీరో అడవి శేష్ స్పందిస్తూ.. డియర్ పవర్ స్టార్.. ఆనందంతో నా గుండె నిడిపోయింది. మీరు టూర్ బిజీలో ఉన్నారుగా సినిమా చూస్తారో లేదో అనుకున్నా .. కానీ మీరు మా టీమ్ పై ప్రశంసలు కురించడం ఆనందంగా ఉంది. మేజర్ సినిమా నాకు సర్వసం.. అప్పుడు పంజా, ఇప్పుడు మేజర్ .. ఇంకా ఎన్నో చెప్పాలి. మీరు పంపిన లెటర్ ను సేవ్ చేసుకుంటా అంటూ రాసుకొచ్చాడు శేష్.

Major

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి