Rana Daggubati: ఆ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన రానా.. ఒకేరోజు రెండుసార్లు చూశానంటూ..

ఇందులో తమిళ్ స్టా్ర్ హీరో సూర్య, విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. జూన్ 3న విడుదలై ఈ సినిమా

Rana Daggubati: ఆ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన రానా.. ఒకేరోజు రెండుసార్లు చూశానంటూ..
Rana 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2022 | 1:51 PM

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్సి(Vikram) నిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో తమిళ్ స్టా్ర్ హీరో సూర్య, విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. జూన్ 3న విడుదలై ఈ సినిమా రెండు వారాల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో శనివారం హైదరాబాద్ లో విక్రమ్ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ యంగ్ హీరో నితిన్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.

హీరో రానా మాట్లాడుతూ : నితిన్ ఫోన్ కమల్ హాసన్ గారు లోకేష్ గారు వస్తున్నారు పార్టీ వుంటుంది రమ్మని పిలిచారు. పార్టీకి ముందు ఒక ఈవెంట్ అక్కడికి వచ్చేయ్ అని ప్లేస్ చెప్పాడు. ఇక్కడి వచ్చి చూస్తే నితిన్ లేడు. (నవ్వుతూ). ఈ మధ్య కాలంలో ఒకే సినిమా ఒకే రోజు రెండు భాషల్లో చూడటం ‘విక్రమ్’ కే జరిగింది. పొద్దున్న మా ఇంటి దగ్గర వున్న ఆర్ కే సినీ ప్లెక్స్ కి వెళ్లాను. అక్కడి తెలుగు వెర్షన్ చూసి మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ లో తమిళ్ వెర్షన్ చూశాను. కమల్ హాసన్ గారిని చూసి సినిమా గురించి నేర్చుకున్నాం. దర్శకుడు లోకేష్ కనగారాజ్ కమల్ గారిని చాలా కూల్ గా చూపించారు. విక్రమ్ టీమ్ కి కంగ్రాట్స్. ‘విక్రమ్’ అద్భుతమైన సినిమా.” అన్నారు.